టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో రిలీజ్ అయిన పోకిరి సినిమా, అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా కలెక్షన్ల స్టామినాని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లింది. అప్పట్లో అతి పెద్ద చరిత్ర సృష్టించిన ఈ సినిమాను కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా మర్చిపోలేరు అనే చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమా అంతలా అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా రిలీజ్ అయిన ప్రతి చోట కూడా అద్భుతమైన కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక అప్పటివరకు ప్రిన్స్ గా టాలీవుడ్ లో కొనసాగిన మహేష్ కు, ఏకంగా సూపర్ స్టార్ ఇమేజ్ ని తీసుకువచ్చిన ఈ సినిమాకు ఇన్నేళ్లకు సీక్వెల్ మొదలవుతోంది. అయితే ఈ సీక్వెల్ మొదలయ్యేది తెలుగులో కాదు హిందీలో. అవునండి మీరు విన్నది నిజమే, 

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, అప్పట్లో వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు మళ్ళి స్టార్ డం తీసుకువచ్చిన సినిమా పోకిరికి హిందీ రీమేక్ గా వచ్చిన వాంటెడ్. అప్పట్లో అతి పెద్ద హిట్ గా నిలిచిన ఈ సినిమా, ఆయనకు కెరీర్ పరంగా మంచి బూస్ట్ ని ఇచ్చింది. అయితే ఒరిజినల్ మాతృకగా వచ్చిన మన తెలుగు పోకిరీకి సీక్వెల్ వస్తుందని ఆ తరువాత చాలామంది భావించారు, కానీ అది ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు. కాగా ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రం సల్మాన్, తన వాంటెడ్ కు సీక్వెల్ గా వాంటెడ్ 2 సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. వాంటెడ్ కు దర్శకత్వం వహించిన ప్రభుదేవానే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథను ప్రభుదేవా సారథ్యంలో సిద్ధం చేయడం జరిగిందని, 

వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని నిన్నటినుండి పలు బాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు విపరీతంగా షికారు చేస్తున్నాయి. అసలు మాతృకకు సీక్వెల్ రాకుండా రీమేక్ సినిమాకు సీక్వెల్ రావడం బాలీవుడ్ లో కొత్తేమి కాదు లెండి అని అంటున్నారు సినిమా విశ్లేషకులు. దానికి కారణం, గతంలో నాగార్జున హీరోగా తెలుగులో సూపర్ హిట్ సాధించిన హలో బ్రదర్ సినిమాను బాలీవుడ్ లో సల్మాన్ జుద్వా గా రీమేక్ చేసి హిట్ సాధించాడు. ఇక ఆ సినిమాకు ఇప్పటివరకు తెలుగులో సీక్వెల్ రానప్పటికీ, ఇటీవల వరుణ్ ధావన్ హీరోగా అదే సినిమాకు బాలీవుడ్ లో జుద్వా 2 పేరుతో సీక్వెల్ తెరక్కడం జరిగింది. మరి ఇది చూసైనా మన మహేష్, పూరి కలిసి అసలు పోకిరికి సీక్వెల్ తీస్తారో లేదో చూడాలి అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: