దాదాపు రెండు సంవత్సరాలు గా నిర్మాణంలో వున్న పీరియాడికల్ మూవీ  సైరా నర్సింహా రెడ్డి.  ఈసినిమా కోసం  డైరెక్టర్ సురేందర్ రెడ్డి  హర్నిశలు  కష్టపడ్డాడు.  ఇక ఎట్టకేలకు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. మరో కొద్దీ రోజుల్లో సైరా  థియేటర్లలోకి రానుంది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో సురేందర్ రెడ్డి , సైరా బడ్జెట్ ను రివీల్ చేశాడు.  ముందుగా ఈసినిమాకు 200కోట్ల బడ్జెట్ అనుకున్నాం అని కానీ ఇప్పుడు అది  270కోట్లకు చేరుకుందని ఆయన వెల్లడించాడు. అంటే ఈలెక్కన 300కోట్లకుపైనే వసూళ్లను రాబడితేవసూళ్లను రాబడితే కాని  సేఫ్ అవ్వదు.



ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయింది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 200కోట్లకుపైగా ప్రీ రీలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.  కాగా అన్ని భాషల డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 40కోట్లకు దక్కించుకుంది. ఇంకా శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ కాలేదు. ఇకఇదిలా ఉంటే సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న  ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయకపోవడం మెగా అభిమానులను  కలవరపెడుతుంది. 




తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా  తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా ఆయనకు జోడిగా  లేడీ సూపర్ స్టార్ నయనతార  నటించింది.   బాలీవుడ్  మ్యూజిక్  డైరెక్ట్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా  కొణిదెల ప్రొడక్షన్స్  పతాకంఫై  రామ్ చరణ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం గాంధీజయంతి రోజు అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా  భారీ అంచనాల మధ్య  తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో విడుదలకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: