నాని కెరియర్ మిడిల్ రేంజ్ హీరో నుండి టాప్ హీరో స్థాయికి ఎదగాలి అంటే ‘గ్యాంగ్ లీడర్’ సూపర్ హిట్ అయి తీరాలి. అందువల్లనే ఈ మూవీ సక్సస్ గురించి నాని తెగ టెన్షన్ పడుతున్నాడు. ప్రస్తుతం ఏ సినిమా సక్సస్ అవుతుందో ఎవరికీ తెలియని పజిల్ గా మారడంతో ఈ మూవీ ఘన విజయం కోసం నాని ఈసారి తన సెంటిమెంట్ నే నమ్ముకుంటున్నాడు. 

నిన్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్ లో జరిగింది. అయితే ఇలా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్ లో జరగడం వెనుక ఒక కారణం ఉందని స్వయంగా నాని నిన్న క్లారిటీ ఇచ్చాడు. 11 సంవత్సరాల క్రితం విడుదలైన నాని మొదటి సినిమా ‘అష్టాచమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. 

అంతేకాదు వైజాగ్ నాని భార్య సొంత ఊరు కావడం కూడ నానీకి సెంటిమెంట్ గా కలిసి వచ్చింది. తిరిగి అదే సెంటిమెంట్ ను నమ్ముకుని నాని ఇప్పుడు సాధారణంగా సినిమా ఫంక్షన్స్ జరిగే హైదరాబాద్ ను కాదనుకుని మళ్ళీ వైజాగ్ బాట పట్టాడు. 

నాని హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 11 సంవత్సరాలు అవుతున్నా అతడు నటించిన ఏ సినిమాకు 50 కోట్ల కలక్షన్స్ ఫిగర్ ను దాటలేదు. టాప్ హీరోలు అంతా 100 కోట్ల ఫిగర్ ను చాల సునాయాసంగా దాటుతున్న పరిస్థుతులలో నాని హీరోగా మరో స్థాయికి ఎదగాలి అంటే అతడి సినిమాలకు వచ్చే కలక్షన్స్ స్థాయి కూడ పెరిగి తీరాలి. ఒకవైపు విజయ్ దేవరకొండ నాని స్థానానికి ఎర్త్ పెట్టబోతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో ‘గ్యాంగ్ లీడర్’ అంచనాలను చేరుకోలేకపోతే నానీకి సమస్యలు రావడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: