గతంలో సూర్య – నయనతార కలిసి కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘అధవన్'(ఘటికుడు) సినిమాలో నటించారు. అంతకు ముందు గజిని సినిమాలో నటించారు. కాకపోతే ఆ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించినంది నయన్.  ఆ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారడమే కాదు ఎక్కువ పారితోషికాన్ని అందుకున్న నటిగా క్రెడిట్ కొట్టేసింది. 


తమిళ స్టార్ హీరో సూర్య తో సినిమా చేస్తున్న దర్శకుడు శివ.. సూర్య సినిమాని త్వరలోనే మొదలెట్టబోతున్నాడు. తమిళంలో 'కాప్పాన్' మూవీ నిర్మితమైంది. సాయేషా సైగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. 'బందోబస్త్' టైటిల్ తో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ఈ సినిమా రిలీజ్ కాకముందే.. సౌత్ ఇండియన్ టాలెంటెడ్, బిజీ హీరోయిన్స్ ఒకరైన నయనతారని ప్రస్తుతం సూర్య నటించనున్న ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. 

దర్శకుడు శివతో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అజిత్ కి వరుసగా భారీ విజయాలను ఇచ్చిన శివపై సూర్య అభిమానులు గట్టి నమ్మకంతో వున్నారు. సూర్యకు ఇది 39వ సినిమా.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ లో ఉన్న ఈ సినిమా కోసం హీరోయిన్స్ నుంచి నటీనటుల ఎంపికచేపట్టినట్లుగా తెలుస్తుంది. సూర్య సరసన హీరోయిన్స్ గా లేడి సూపర్ స్టార్ నయనతార పేరు పరిశీలిస్తుండగా, సెకండ్ హీరోయిన్ ప్లేస్ కి కాజల్ అగర్వాల్ పేరుని పరిశీలిస్తుందట చిత్ర బృందం.

అయితే ఈ మూవీలో నయనతార పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్నట్లు సమాచారం. ఇమాన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. తమిళ నాట మంచి హిట్ కాంబినేషన్ అంటున్న సూర్, నయన్ ఈసారి ఎంత వరకు హిట్ అందుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: