విలక్షణాత్మక డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. సరికొత్త కథాంశంతో తలకెక్కిన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన రిలీజ్ కి సిద్ధమైంది. అంటే రేపు అర్థరాత్రి ప్రీమియర్స్ పడిపోతాయి. ఈ సినిమాలో రివెంజ్ రైటర్ పార్థసారథిగా కనిపించే నాని ఐదుగురు ఆడవాళ్లను వేసుకొని విలన్ పైన ఎలా గెలుస్తాడు అన్నదే కథాంశం అని మనం టీజర్ మరియు ట్రైలర్ ద్వారా చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ ట్విస్టు బయటకు వచ్చేసింది.

'ఆర్ఎక్స్ 100 ఫేమ్' కార్తికేయ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాని డబుల్ యాక్షన్ చేయబోతున్నాడట. అతను చేయబోతున్న ద్విపాత్రాభినయంలో ఒకటి పార్థసారధి కాగా మరొక క్యారెక్టర్ ని మాత్రం చిత్ర బృందం చాలా గుట్టుగా ఉంచింది. టీజర్, ట్రైలర్, పాటలు మరియు ప్రోమోలు దేంట్లో కూడా దీనిపై చిన్న అనుమానం రాకుండా జాగ్రత్త పడిన టీం చివరి నిమిషంలో ఆదమరిచిందో ఏమో కానీ మొత్తానికి ఈ విషయం బయటకు వచ్చేసింది. 

ఇక ఈ చిత్రం విషయానికి వస్తే కార్తికేయ ఈ సినిమాలో ఎఫ్ వన్ రేసర్ గా కనిపించనున్నాడు. అయితే అతను ఒక భారీ దొంగతనానికి కూడా ప్లాన్ వేసినట్లు కూడా తెలుస్తుంది. తన చిత్త్రాలలో ఏదో ఒక కొత్తదనం చూపించే విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రం ద్వారా ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అని టాలీవుడ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మరొక అప్డేట్ ఏమిటంటే కొరియన్ సినిమా అయినా 'గర్ల్ స్కౌట్స్' కి ఈ చిత్రం రీమేక్ అట.

మొత్తానికి మన నాని 'జెర్సీ' తో భారీ హిట్ అందుకున్న తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. అయితే నాని చేసిన ద్విపాత్రాభినయం ఈ సినిమాకి ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: