టాలీవుడ్ లో ఆ మద్య ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి పాత్రపై వర్మకు వ్యతిరేకంగా కేతినేని జగదీశ్వర్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.   లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాకిలో హీరోయిన్ గా వాణీ విశ్వనాథ్ నటిస్తుందని వార్తలు కూడా వచ్చాయి.  కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ పట్టాలేక్కలేక పోయింది.  ఇక  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలోలక్ష్మీస్ వీరగ్రంధం వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 

ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ అయి మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. అప్పుడప్పుడు టాలీవుడ్ లో తన సంచలన వ్యాఖ్యలతో హల్ చల్ చేస్తుంటారు కేతినేని జగదీశ్వర్ రెడ్డి.  ఈ మద్య బిగ్ బాస్ 3 కి వ్యతిరేకంగా నటి  శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తాలు ఢీల్లి స్థాయిలో పోరాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేతినేని సైతం వారికి సంఘీభావం పలుకుతూ బిగ్ బాస్ 3 మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిందని ధ్వజమెత్తారు.  తాజాగా మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

చిత్రపురి భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అసలైన సినీ కార్మికులకు న్యాయం జరగడం లేదని టాలీవుడ్ సినీ వర్కర్స్ కొన్ని నెలలుగా నిరసన చేపడుతున్నారు.దాదాపు 4000 మందికి పైగా గృహవసతి కల్పించాలనేది ప్లాన్. కానీ ఇందులో జరుగుతున్న అవినీతితో చిత్ర పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు 2300 మందికి అక్రమంగా ఇంటిని కేటాయించినట్లు కేతిరెడ్డి ఆరోపిస్తున్నారు.  గత కొంత కాలంగా దొంగ సభ్యత్వాలతో సుమారు వెయ్యి కోట్లు నొక్కేశారని ఆరోపణ చేశారు.

ఇందుకు ఉదాహారణ అక్కడ జూనియర్ ఆర్టిస్టులు, సినీమా వాళ్ల కన్నా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇందులో ఇళ్ళని కేటాయించారు. దొంగ సభ్యత్వాలు క్రియేట్ చేసినట్లు కేతిరెడ్డి ఆరోపించారు.  ఈ అవినీతికి బాధ్యత వహిస్తూ కమిటీ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించి నిజమైన సినీ కార్మికులకు న్యాయం జరిగేలా చేయాలని కేతిరెడ్డి కోరారు. మరి కేతినేని చేస్తున్న ఆరోపణలు ఎంత వరకు నిజమో..అవాస్తవమో అనేది త్వరలో తెలియనుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: