డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, డైలాగ్ రైటెర్ గా పూరి స్టైల్ గాని, మార్క్ గానీ ఇంకెవరు ఫాలో అవలేరు. ఒకరకంగా చెప్పాలంటే పూరి ని కాపీ కొట్టడం మరొక డైరెక్టర్ వల్ల కాదని ఎప్పుడో అందరికి అర్థమైపోయింది. దర్శకుడిగా కంటే డైలాగ్ రైటర్ గా పూరి ఎక్కువ మార్కులు సంపాదించుకున్నారు. ఈ మాట పూరి ఒప్పుకుంటాడు. తనలోని డైరెక్టర్ ని డైలాగ్ రైటర్ ఎక్కువగ డామినేట్ చేస్తాడని చాలా సందర్భాల్లో పూరి చెప్పడం విశేషం. 

ఇక పూరి డైలాగ్స్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకోవడం విశేషం. పూరి ఫస్ట్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి నుండి ఇప్పటి వరకు పూరి డైలాగ్స్ సినిమాలో ఎంతో స్పెషల్ గా ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. హీరో ఎవరైనా పూరి స్టైల్లో డైలాగ్స్ పడాల్సిందే. "నువ్వు నందా ఐతే నేను బద్రి.. బద్రీనాధ్ అయితే ఏంటి" "మళ్ళీ ఇదే రిపీటవుద్ది ఏంచేయాలో ముందు డిసైడ్ చేస్కో" వంటి డైలాగ్స్ పవర్ స్టార్ పవర్ ను పూరి స్టైల్ ను ఇండస్ట్రీ మొత్తం ఆకట్టుకుంది. ఒక్క బద్రి సినిమా పూరి ని ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేలా చేసింది. పూరి కథ కొన్ని సినిమాలకు రొటీన్ గా ఉన్నప్పటికి ఆ సినిమాలో హీరోయిజం..ఆ హీరోతో చెప్పించే డైలాగ్ మాడ్యులేషన్ జనాలని విపరీతంగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయంటే పూరి రాసిన డైలాగ్స్ ఎంతగా ఆకట్టుకుంటాయో తెలుస్తుంది.

ఇక పూరి సినిమాలో హీరోకి బాగా దూకుడు స్వభావం ఉండటం మరో ప్రత్యేకత. పూరి ఎలాంటి నేపథ్యంలో కథ ని సెలెక్ట్ చేసుకున్నాగాని హీరో క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ మాంచి ఎనర్జిటిక్ గా ఉంటాయి. అదే పూరి సినిమాలు సక్సస్ అవడానికి పెద్ద ఎస్సెట్. పవర్ స్టార్, తారక్, రామ్ చరణ్, బన్ని, నితిన్, రామ్, ఆకాష్ పూరి..ఇలా హీరో ఎవరైనా సరే ఆ హీరో మీద పూరి స్టాంప్ ఉండాల్సిందే. సిల్వర్ స్క్రీన్ మీద హీరోని పూరి ప్రజెంట్ చేసినట్టుగా ఇంకే డైరెక్టర్ ప్రజెంట్ చేయడన్నది వాస్తవం. అంతేకాదు ఈ విషయం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అందుకే అందరు పూరి పెన్నుకు పదునెక్కువ, తన హీరోకి దూకుడెక్కువ అని అంటుంటారు. హీరోలు కూడా పూరి కథ చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: