మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  రుపొందుతున్న  చిత్రం  ‘సైరా'.  కాగా  ఇప్పటికే 'సైరా' కోసం మెగా టీమ్ భారీ ప్రమోషన్లను ప్లాన్ చేస్తోంది.  అందులో భాగంగానే భారీగా  ప్రీ రిలీజ్ వేడుకను  కర్నూల్ ప్రాంతంలో సెప్టెంబర్ 18న నిర్వహించనున్నారు.  అయితే కొన్ని రోజుల క్రితం భారీ అంచనాల నడుమ విడుదలైన  'సాహో' ప్లాప్ తో సరిపెట్టుకుంది.  మొత్తానికి సాహో పూర్తిస్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. దాంతో బలమైన ఓపెనింగ్స్ వచ్చినా.. ఆ తరువాత  లాంగ్ రన్ వసూళ్ల మీద సినిమా టాక్ బాగానే  ఎఫెక్ట్ చూపింది.  దీంతో 'సైరా' టీం   'సాహో' విషయంలో జరిగిన పొరపాటును  తమ సినిమా విషయంలో జరగకూడదని  అన్ని అంశాలను పలుసార్లు చెక్ చేసుకుంటున్నారట. ముఖ్యంగా ఫస్ట్ డేట్ నాడు ఎలాంటి బ్యాడ్ టాక్ రాకుండా రివ్యూస్ లాంటిని మ్యానేజ్ చేయాలని చూస్తున్నారట. ఏమైనా సైరాకి సాహో బాగానే పాఠం నేర్పింది.   అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రం  విడుదల కానుంది.  ఇప్పటికే ఈ సినిమా కోసం మెగా అభిమానులు మరియు మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సినిమా ట్రైలర్  కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సైరా టీమ్  లేట్ చెయ్యకుండా  సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వడం మొదలు పెడితే.. మెగా అభిమానులు  సినిమాను మరింతగా జనంలోకి తీసుకువెళ్తారు.  


ముందుగా   సైరా టీమ్ భారీ ఎత్తున  గొప్ప ప్రచార ప్రణాళికలను రూపొందించాలి. అప్పుడే  సైరా పై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి పెరుగుతుంది. మిగిలిన భాషల్లోకి కూడా బాగా వెళ్తుంది.  అయితే ఎప్పటినుంచో  రిలీజ్ చెయ్యటానికి చూస్తోన్న ఈ సినిమా స్పెషల్ పోస్టర్ ను  త్వరగా రిలీజ్ చెయ్యాలి.  అమితాబ్ బచ్చన్ మరియు చిరంజీవిల కాంబినేషన్ లో వచ్చే ఈ స్పెషల్ పోస్టరే  హిందీలో  సైరాకి బజ్ ను డిసైడ్ చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా  'వార్' మూవీ, సైరాకి హిందీలో పోటీగా రిలీజ్ అవుతుంది. మరి  ఆ పోటీలో నెగ్గాలంటే ప్రమోషన్స్ బలంగా చెయ్యాలి.  ఇక ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్  వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ రానున్నారట.  సుమారు రూ.270 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.  సినిమాకున్న క్రేజ్ మూలాన ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం భారీ ఎత్తున జరుగుతోంది.  ఈ చిత్రం  ఖచ్చితంగా మరో సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: