యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఆరేంజ్ అంచనాలతో.. అంతే స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీన తెలుగు - తమిళ్ - మలయాళం - హిందీ - కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. సైరాకు ఓవ‌రాల్‌గా రూ.250 కోట్ల బ‌డ్జెట్ అయిన‌ట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


రామ్ చరణ్ కు ధృవ లాంటి యాక్షన్ ఎంటర్ టైన‌ర్‌ ఇచ్చిన సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు వెల్లడయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 112 కోట్ల మేర రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఓవ‌ర్సీస్‌ ఇప్పటికే 18 కోట్లకు అమ్మార‌ని టాక్‌. ఇక తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో బిజినెస్ ఎంత అనేది తెలియాల్సి ఉంది.


ఈ సినిమాకి నైజాం- 30కోట్లు (దిల్ రాజు).. సీడెడ్- 22 కోట్లు (ఎన్ వి ప్రసాద్).. నెల్లూరు- 5.20 కోట్లు (హరి పిక్చర్స్).. కృష్ణా - 9కోట్లు (జీ3 ఫిల్మ్స్).. గుంటూరు -11.50 కోట్లు (యువి క్రియేషన్స్).. వైజాగ్- 14.40 కోట్లు (క్రాంతి ఫిలింస్).. తూర్పు గోదావరి -    10.40 కోట్లు (విజయ లక్ష్మి ఫిలింస్).. పశ్చిమ గోదావరి- 9.20 కోట్లు (ఉషా పిక్చర్స్) మేర పలికింది. ఓవరాల్ గా ఆంధ్రా- తెలంగాణా కలుపుకుని 112 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది.


చిరు, న‌య‌న‌తార‌, అమితాబ‌చ్చ‌న్‌, త‌మ‌న్నా, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి లాంటి స్టార్లు న‌టించిన ఈ సినిమా ప్రి రిలీజ్ వేడ‌క ఈ నెల 18న జ‌ర‌గ‌నుంది. భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న సైరా ఏం చేస్తుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: