భాష ఏదైనా కానీ , ఒక సినిమా ప్రేక్షకులని మెప్పించి  హిట్ కావాలంటే ఆ సినిమాలో  హీరో , విలన్ ఇద్దరికి  సామానమైన ప్రాముఖ్యత ఉండాలి.  విలన్ ఎంత భాగా నెగిటివ్ కెరెక్టర్ చేస్తాడు అన్న దాన్ని బట్టి సినిమా హిట్ మీద ఆధారపడి వుంటుంది. విలన్ తన విలనిజం ఎంత చూపిస్తే , హీరోని అంతబాగా చూపించవచ్చు. ఒకప్పుడు మన సినిమాలలో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఎలా వుంది అని ప్రేక్షకులు చూసేవారు కాని ఇప్పుడు ఆ రోజుల్లో లాగా ఇలా కొడితే అలా పడిపోయే విలన్స్ తెలుగు ఆడియన్స్ పెద్దగా చూడడం లేదు. విలన్ అంటే హీరో తరువాత సినిమాకి మరో హీరోలా ఉండాలి. ఇదే ఇప్పటి విజయ సూత్రం. ఇకపోతే మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది విలన్స్ ఉన్నారు. వారిలో కొంతమంది విలనిజాన్ని చూసి ..విలన్ అంటే మరీ ఇంత ఘోరంగా ఉంటారా అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుగు సినీ ఇండస్ట్రీలో  టాప్ టెన్ విలన్స్ ని ఒకసారి చూద్దాం.....


1. ప్రకాష్ రాజ్ దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు. ఈయన కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26 న జన్మించాడు. ప్రకాష్ రాజ్ మొదట  లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. కానీ , కొన్ని కారణాలతో ఆమెతో విడిపోయి  బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నాట్యకారిణి పోనీ వర్మ ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. ఈయన చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి , టాప్ విలన్ స్థాయికి అతి తక్కువ సమయంలోనే చేసురుకున్నాడు. విలనిజాన్ని తనదైన శైలిలో పండించడంలో ప్రకాష్ రాజ్ తరువాతే ఎవరైనా అనేలా పేరుతెచ్చుకున్నారు. బద్రి , అంతఃపురం , గంగోత్రి , ఒక్కడు , ఇడియట్ వంటి చాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల వద్ద సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. హీరోతో పనిలేకుండా ప్రకాష్ రాజ్ ఉంటె సినిమా చూడచ్చు అనే స్థాయికి చేరుకున్నాడు. నటుడిగానె కాకుండ దర్శకుడిగా, నిర్మాతగాను వ్యవహరించారు.  

2 . జగపతిబాబు తెలుగు సిని నటుడు. జగపతి బాబు విజయవాడలో పుట్టి మద్రాస్ లో పెరిగారు. మద్రాస్ లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు, నటన మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చాడు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగప్రవేశం చేశాడు. యస్.వి. కృష్ణరెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇక అక్కడినుండి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 80 చిత్రాలలో పనిచేసాడు. వచ్చిన ఏ పాత్రనైనా సమర్ధవంతంగా పోషించగల నటుడిగా పేరుతెచ్చుకున్న జగపతిబాబు మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాయించుకున్నారు. అలా అని ఏఒక్క రంగానికో పరిమితం కాకుండా ప్రయోగాలను చేస్తూ వచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో చేసిన సారాయి వీరాజు  పాత్రలో జీవించి ప్రేక్షకులను మైమరపించారు. ఆ తరవాత సముద్రం, మనోహరం వంటి చిత్రాలతో ప్రయోగాలకు చిరునామాగా మారాడు. హీరోగా అవకాశాలు తగ్గిపోయిన తరువాత బోయపాటి  , బాలయ్య కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లెజెండ్ లో ప్రతినాయకుడిగా  నటించి , విలన్ అంటే ఇలా ఉండాలి అనిపించాడు. ఆ తరువాత రామ్ చరణ్ రంగస్థలం లో సర్పంచ్ పాత్రలో జగపతిబాబుని తప్ప , ఇంకెవరిని ఊహించలేని విధంగా తన నటనలో మరోకోణాన్ని బయటపెట్టి టాలీవుడ్ లో విలన్ గా అగ్రపథం లో కొనసాగుతున్నాడు.

3 . రానా దగ్గుపాటి ... ప్రముఖ నిర్మాత మూవీ మొగల్ రామానాయుడు మనవడు , నిర్మాత సురేష్ బాబు కొడుకు. రానా  14 డిసెంబరు 1984 లో చెన్నై లో జన్మించాడు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో సినిమాలపై ఉండే ఆసక్తితో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే కేవలం హీరోగానే కాకుండా , నచ్చిన ప్రతి పాత్రని చేసుకుంటూపోయాడు. అదే ఈ రోజు రానాని ఈ స్థాయిలో నిలబెట్టింది. లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రానా  టాలీవుడ్ లోనే కాకా బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు. ఇక టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన బాహుబలి లో భళ్లాలదేవుని పాత్రలో నటించి ..బాహుబలికి సరైన మొగుడు వీడే అనిపించేలా తన పాత్రకి న్యాయం చేసాడు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు.

4 . సోనూసూద్ .... చూడటానికి హీరోలా ఉండే దేహం , హీరోలనిమించే ఫోర్ఫామెన్స్. హీరో ముందు నిలబడితే హీరో కూడా ఒక్క క్షణం బయపడిపోవాల్సిందే అంతలా అందరిని భయపెట్టాడు సోనూసూద్. 30 జూలై 1973న సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు. చిన్నప్పటినుండే  నాటకాలలో కూడా నటించేవాడు. ఆ తరువాత అతడు సినిమాతో టాలీవుడ్ లోకి స్టైలిష్ విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. కొన్ని రోజులపాటు సోనూసూద్ హావ బాగానడిచింది. ఇక కోడి రామక్రిష్ణా డైరెక్షన్ లో అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన అరుంధతి చిత్రంతో ఎనలేని గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో దెయ్యంగా సోనూసూద్ నటన తెలుగు సినీ అభిమానులని నిజంగానే భయపెట్టింది.

5 . సంపత్ రాజ్.. ఈయన జనవరి 15, 1976లో జన్మించారు ఇతను ఒక దక్షిణ భారతీయ సినీ నటుడు.  తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలలో ఎక్కువగా  విలన్ గాను , సహాయ పాత్రలలో  నటించి మెప్పించాడు. మిర్చి, దమ్ము, శ్రీమంతుడు, లౌక్యం సినిమాల్లో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి. ముఖ్యంగా మిర్చి సినిమాలో ఈయన నటన , సినిమాకి మరో హైలెట్ అని చెప్పాలి. ఆ సినిమాలో ప్రభాస్ హీరోయిజం పండటానికి కూడా సంపత్ రాజ్ కారణం. 



మరింత సమాచారం తెలుసుకోండి: