కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా అట్లీ డైరక్షన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ బిగిల్. స్పోర్ట్స్ బ్యాజ్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఈ ఇయర్ దీపావళి కానుకగా రిలీజ్ ప్లాన్ చేశారు. విజయ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను తెలుగులో ఎవరు ఊహించని విధంగా మహేష్ దక్కించుకున్నారు.   


అదేంటి ఒక స్టార్ హీరో సినిమాను మరో స్టార్ హీరో రిలీజ్ చేస్తున్నాడా.. అయినా మహేష్ బాబు ఇదవరకు ఎప్పుడూ ఇలా డబ్బింగ్ సినిమాలు చేయలేదు కదా అనుకోవచ్చు. ఇక్కడ మహేష్ అంటే సూపర్ స్టార్ మహేష్ కాదు నిర్మాత మహేష్ కోనేరు. ఎన్టీఆర్ పి.ఆర్ గా ఉన్న తను ఈస్ట్ కోస్ట్ ఎంటర్టైన్మెంట్స్ లో ఈమధ్య 118 సినిమా నిర్మించాడు.     


కళ్యాణ్ రాం హీరోగా వచ్చిన 118 సినిమాతో విజయాన్ని అందుకున్న మహేష్ కోనేరు ప్రస్తుతం కీర్తి సురేష్ తో మిస్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో పాటుగా విజయ్ బిగిల్ సినిమాను తెలుగు డబ్బింగ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట. ఇప్పటికే బిగిల్ నిర్మాతలతో మహేష్ డీల్ ఓకే అయ్యిందని తెలుస్తుంది. నందమూరి హీరోలకు పి.ఆర్ గా ఉన్న మహేష్ ఎస్ కోనేరు నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.    


విజయ్ సినిమాలు తమిళంలో సూపర్ హిట్ అవుతున్నా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోవట్లేదు. తెలుగులో అతని సినిమాలు రిలీజ్ అవుతున్నా విజయ్ ను తెలుగు ప్రమోషన్స్ కు రప్పించిన నిర్మాత లేడు. అయితే అది బిగిల్ తో సాధ్యమవుతుందేమో చూడాలి. ఎలాగు డబ్ చేసేది మహేష్ కాబట్టి ఎన్.టి.ఆర్ లేదా కళ్యాణ్ రాం బిగిల్ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి బిగిల్ తో విజయ్ తెలుగులో సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: