రెబల్ స్టార్ ప్రభాస్ సహా ఆయన ఫ్యాన్స్ అందరూ ఇటీవల రిలీజ్ అయిన సాహో సినిమాపై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. బాహుబలి సినిమాల అత్యద్భుత సక్సెస్ ల తరువాత రాబోతున్న మూవీ కావడం, అదీకాక ఆ సినిమాల ద్వారా ప్రభాస్ రేంజ్ కూడా విపరీతంగా పెరగడంతో, ఆయన సాహోతో తప్పకుండా సక్సెస్ ని సాధిస్తారని అందరూ భావించారు. అయితే తొలిరోజు తొలి ఆట నుండే ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరవడం మొదలెట్టారు. సినిమాలో గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ మీద ఎంతో దృష్టిపెట్టిన సినిమా యూనిట్, అంతకంటే అతి అతిముఖ్యమైన కథ, కథనాలపై మాత్రం దృష్టిపెట్టలేదని మెజారిటీ ప్రేక్షకులు చేస్తున్న విమర్శ. ఇక మొదటి రెండు మూడు రోజలు, కాస్త సెలవులు కలిసి రావడంతో, ఎలాగ బండి లాగిన సాహో, 

ప్రస్తుతం మాత్రం దాదాపుగా చాలాచోట్ల చతికిలపడ్డట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక కొన్ని ప్రాంతాల్లో సినిమాను కొన్న బయ్యర్లకు భారీ స్థాయిలోనే లాస్ రానున్నట్లు చెప్తున్నారు. నిజానికి సాహో సక్సెస్ కాకపోవడానికి ప్రస్తుతం ప్రచారం అవుతున్న కారణాలు ఎంతవరకు ఉన్నాయి అనే చర్చను ప్రక్కన పెడితే, ఆ సినిమా యూనిట్ చేసిన అతి పెద్ద తప్పిదం వల్లనే ఇంత నష్టం వాటిల్లిందని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. వాస్తవానికి బాహుబలి రెండు భాగాలూ కూడా ఎంతో భారీ ఖర్చుతో గ్రాండియర్ గా నిర్మితం అయిన చిత్రాలు కావడం, అలానే ఆకట్టుకునే కథ, కథనాలతో ఆ సినిమాలు తెరకెక్కడంతో అవి సక్సెస్ ని అందుకున్నాయి. మరి అంతటి భారీ హిట్స్ తరువాత సాధారణంగా ఆ హీరో ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఊహకందని స్థాయిలోఉంటాయి అనేది వాస్తవం. అటువంటపుడు హీరో ప్రభాస్, దర్శకుడు సుజీత్, 

మరియు నిర్మాతలు కలిసి బాగా ఆలోచించుకుని సాహోను బాగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తే బాగుండేది అంటున్నారు. అలానే ఆ సినిమా షూటింగ్ మొదలెట్టిన దగ్గరి నుండి సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజువరకు కూడా సినిమాపై ప్రేక్షకుల్లో సాధారణ స్థాయిలో అంచనాలు ఉండేలా, ఈ సినిమాను బాహుబలితో పోల్చవద్దు, హీరో గారి ఇమేజిని బట్టి తక్కువ బడ్జెట్ తో మిమ్మల్ని అలరించేలా సినిమా తీస్తున్నాం అంటూ మొదటి నుండి ప్రచారం చేసి ఉండాల్సిందని, మరీ ముఖ్యంగా అతి తక్కువ ఖర్చుతో సినిమాను మొదలెట్టిన యూనిట్, ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలు ఉంటాయి కాబట్టి, మనం ఎంత ఖర్చు చేసినా ప్రేక్షకులు మాత్రం బాహుబలిని ఊహించుకుని థియేటర్ కు వస్తారు అనే లాజిక్ మాత్రం పూర్తిగా మిస్ అయి, మరింత భారీగా ఖర్చు చేసి తప్పు చేసారని అంటున్నారు. ఖచ్చితంగా మొదటి నుండి కాస్ట్ కంట్రోల్ పాటించి ఉంటె, సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా, నష్టాలు మాత్రం ఈ స్థాయిలో వచ్చేవి కాదంటున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: