బాలక్రిష్ణ సీనియర్ మోస్ట్ హీరోగా టాలీవుడ్లో ఉన్నారు. ఆయన సినిమాల హిట్లు, ఫట్లతో లేకుండా చేసుకుపోతారు. అయితే ఈ ఏడాది వచ్చిన ఎన్టీయార్ కధానాయకుడు, మహానాయకుడు మూవీస్ డిజాస్టర్స్ తరువాత బాలయ్య నెమ్మదించారు. మధ్యలో ఎన్నికలు రావడం, పార్టీ ఓటమి పాలు కావడంతో బాలయ్య రాజకీయాలపై ఆసక్తిని తగ్గించారు. దాంతో మళ్ళీ మూవీస్ లో జోరు పెంచారు.


బాలయ్య ఇపుడు సి కళ్యాణ్ మూవీలో నటిస్తున్నారు. దానికి డైరెక్టర్ గా కేఎస్ రవికుమార్ వర్క్ చేస్తున్నారు. బాలయ్యతో 2018లో జై సింహా మూవీని తీసిన రవికుమార్ కే పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. దాంతో ఆయన తనదైన స్టైల్లో  సీరియస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మూవీ తీస్తున్నారు. ఈ మూవీలో ఇద్దరు బాలయ్యలు ఉంటారు. అంటే డ్యూయల్ రోల్ అన్నమాట.


ఒక బాలయ్య లుక్ ని ఈ మధ్యనే రిలీజ్ చేశారు. యంగ్ గెటప్ లో ఉన్న బాలయ్య లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇపుడు ఆయన తమ్ముడు లుక్ కూడా త్వరలో రిలీజ్ చేస్తారట. మరీ యంగ్ గా బాలయ్య ఆ పాత్రలో కనిపిస్తాడని నిర్మాత సి కళ్యాణ్ అంటున్నారు. ఆ రెండో పాత్ర కోసం బాలయ్య బాగా సన్నగా స్లిమ్ గా కనిపించేందుకు భారీ కసరత్తులు చేస్తున్నాడుట.


రోజులో అయిదు గంటల పాటు బాలయ్యకు ఇదే పనిట. తెల్లవారుజామున మూడున్నరకే లేచి ఆరు వరకూ ఎక్సర్ సైజులు చేస్తారుట. తిరిగి సాయత్రం మరో గంటన్నర పాటు జిమ్ లో కసరత్తులే కసరత్తులు చేస్తున్నాడుట. ఈ మూవీలో బాలయ్య బాధ చూసి నిర్మాత కళ్యాణే తెగ ఫీల్ అవుతున్నారు. బాలయ్య లుక్ బాగుంటే ఆ మూవీ సూపర్ హిట్ అని తమ సినిమాలో అన్నీ కుదిరాయని బంపర్ హిట్ కొడుతుందని కళ్యాణ్ ధీమాగా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: