తెలుగు సినిమా ఇండస్ట్రీలో చలపతిరావు కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని వందల సినిమాలలో తనదైన నటనతో తెలుగు సినీ అభిమానుల గుండెల్లో  ప్రత్యేకమైన ముద్ర వేసిన నటుడు ఈయన. ఈయన ఎంతో మంది స్టార్స్ పక్కన నటించినా , ఎన్నో సినిమాలలో సినిమాని మలుపు తిప్పే పాత్రలలో నటించినా రాని గుర్తింపు కేవలం ఒకే ఒక మాట ద్వారా వచ్చింది. ఆ మాట ఏమిటంటే ... ప్రస్తుతం అమ్మాయిలపై అసభ్యకరమైన కమెంట్స్ చేయడం. అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన  రారండోయ్ వేడుక చూద్దాం సినిమా  ఆడియో వేడుకలో అమ్మాయిలు పడుకోడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు అంటూ ఒక సంచలనమైన కామెంట్ చేసారు.  దీనితో  సోషల్ మీడియాలో ఈయనపై ఇష్టమొచ్చినట్లు ట్రోల్ చేసారు. 

ముఖ్యంగా మహిళా సంఘాలు అయితే చలపతిరావు అనే వ్యక్తి బతకడమే వేస్ట్ అనే స్థాయిలో అయన పై విరుచుకుపడ్డాయి.  సినిమా వాళ్ల బలుపు చూపించాడంటూ ఇష్టమొచ్చినట్టు ఈయన్ని ఏకిపారేసారు. ఆ మాట అన్నందుకు అయన  కొన్ని వందలసార్లు క్షమాపణ చెప్పినా కూడా ఎవరూ కనీసం పట్టించుకోలేదు. మీడియా కూడా తన విషయంలో చాలా ఘోరంగా వ్యవహరించిందని తాజాగా చలపతిరావు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొని బాధపడ్డాడు.

ఈ బాధ తట్టుకోలేక ఓ క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. ఆ సూసైడ్ నోట్‌లో మహిళా సంఘాల పేర్లు రాసి.. వాళ్లకు క్షమాపణలు చెప్పాలనుకున్నట్లు చెప్పాడు.మీరు నన్ను బతకనిచ్చేలా లేరు.. సారీ అమ్మా అని రాయాలనుకున్నానని తెలిపాడు ఈయన. నాకు  22 ఏళ్ల వయసులో భార్య చనిపోతే మళ్లీ తాను పెళ్లి చేసుకోలేదని.. అలాంటి తనపై ఇలాంటి నిందలు వచ్చేసరికి తట్టుకోలేకపోయానని చెప్పాడు చలపతిరావు. అప్పట్లో ఈ విషయంపై ఇండస్ట్రీ అంతా కలిసి  ఈ సీనియర్ నటుడికి సపోర్ట్ చేసినా కూడా ఆయన మాటలను మాత్రం అంతా తప్పుబట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: