నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణలో వస్తున్న ఈ సినిమాలో తమిళ అమ్మాయి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 13 శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.    


నాని అన్ని సినిమాల్లానే ఈ సినిమా కూడా సెన్సార్ సభ్యుల నుండి ప్రశంసలను అందుకుందట. ముఖ్యంగా సినిమా కథ, కథనంతో పాటుగా దర్శకుడు సినిమాను నడిపించిన తీరు చాలా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తుంది. గ్యాంగ్ లీడర్ సినిమాపై నాని భారీ హోప్స్ పెట్టుకున్నాడు. 


ఈ ఇయర్ ఆల్రెడీ జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ తో కూడా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, శరణ్య నటించారు. సెన్సార్ వారు నాని గ్యాంగ్ లీడర్ కు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో విలన్ గా ఆరెక్స్ 100 కార్తికేయ నటిస్తుండటం విశేషం. 


హలో తర్వాత విక్రం కె కుమార్ ఎంతో జాగ్రత్తగా ఈ సినిమా తెరకెక్కించారు. సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నాని సినిమా రిజల్ట్ మీద కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. మరి నాని హిట్ మేనియాను గ్యాంగ్ లీడర్ కొనసాగించేలా చేస్తుందో లేదో చూడాలి. చిరు టైటిల్ పెట్టుకున్నాడు కాబట్టి నాని కచ్చితంగా హిట్ కొట్టి చూపిస్తాడని అంటున్నారు.      



మరింత సమాచారం తెలుసుకోండి: