అందరు హీరోయిన్లు ఒక వైపు తానొక వైపు అన్నట్టుగా ఉంటుంది స్వీటీ అనుష్క. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యోగా బ్యూటీ ఆ తర్వాత స్టార్ ఛాన్సులతో రెచ్చిపోయింది. తెలుగులో ఫీమేల్ లీడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనుష్క, కమర్షియల్ సినిమాలతో కూడా సత్తా చాటింది.


బాహుబలి రెండు పార్టులతోనే కాదు భాగమతి అంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అనుష్క. ప్రస్తుతం అనుష్క లీడ్ రోల్ లో నిశబ్ధం అనే సినిమా వస్తుంది. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో కోనా ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క మూగ అమ్మాయిగా నటిస్తుంది. 


సినిమాలో ఆమె పాత్ర పేరు సాక్షి అని తెలుస్తుంది. సాక్షి ఏ మ్యూట్ ఆర్టిస్ట్ అని నిశబ్ధం ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై క్రేజ్ తెచ్చేలా చేశారు. కచ్చితంగా అనుష్క చేస్తున్న మరో కొత్త ప్రయోగం ఈ నిశబ్ధం మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అనుష్కతో పాటుగా మాధవన్ కూడా నటిస్తున్నారు.


అనుష్క చేస్తుంది అంటే సినిమాలో తప్పకుండా మ్యాటర్ ఉన్నట్టే లెక్క. కొద్దిపాటి గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న ఈ నిశబ్ధం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా మొత్తంలో అనుష్క మూగ పాత్రలో కనిపించనుంది. మరి అనుష్క చేస్తున్న ఈ కొత్త అటెంప్ట్ ఆమెకు కొత్త అవార్డులు తెచ్చి పెట్టాలని ఆశిద్దాం. 


షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. సోలో సినిమాతో అనుష్క మరోసారి తన సత్తా చాటుతుందని అంటున్నారు. సినిమా రిలీజ్ అయితే కాని అసలు విషయం తెలుస్తుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: