అనుష్క శెట్టి హీరోయిన్ గా చేస్తున్న నిశ్శబ్దం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న రిలీజ్ చేశారు.  ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఆమె చాలా స్మార్ట్ గా ఉన్నారు.  సన్నబడి కనిపించారు.  అనుష్క బాహుబలి సినిమా సమయంలో కొంచం బొద్దుగా ఉన్నది.  కొన్ని సీన్స్ లో ఆమె రూపం కోసం గ్రాఫిక్స్ ను వియోగించారు.  ఎందుకంటే రాణిపాత్ర కాబట్టి వెయిట్ ఉండాలి.  అందుకోసమే ఆమెను గ్రాఫిక్స్ లో కొద్దిగా లావుగా ఉన్నట్టు చూపించారు రాజమౌళి.  ఆ తరువాత సినిమా కోసం కష్టపడి తగ్గినట్టుగా చెప్పారు.  


దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను నిశ్శబ్దం సెట్స్ మీదకు వెళ్లే ముందు చూపించారు.  అయితే, కొన్ని రోజుల క్రితం అనుష్క ముంబై ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.  అనుష్క ఏ మాత్రం తగ్గినట్టుగా కనిపిస్తోంది.  చెప్పాలంటే ఇంకొంచం లావుగా మారింది.  బహుశా బాహుబలి తరువాత నిశ్శబ్దం తప్పా మరో సినిమా అఫర్ రాలేదు.  లావు తగ్గలేదు కాబట్టి ఆమెకు ఆఫర్లు రావడం లేదని అంటున్నారు.  


అనుష్క ఎందుకని అలా బొద్దుగా కనిపించేందుకు ఇష్టపడుతుందో అర్ధం కావడం లేదు.  యోగ టీచర్ అయ్యుండి కూడా ఇలా బొద్దుగా ఉండటానికి ఈ ముద్దుగుమ్మ ఇష్టపడుతుంది అంటే దాని వెనుక ఇదొక మతలబు ఉండే ఉంటుంది.  లేకుండా ఆమె అలా కనిపించేందుకు ఆసక్తి చూపదు.  మరి నిశ్శబ్దంలో ఎందుకు అలా లావుగా ఉన్నట్టుగా చూపించారు.  దాని వెనుక కారణం ఉన్నదా అంటే ఉండే ఉంటుంది.  నిశ్శబ్దం కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేస్తున్నారని అర్ధం అవుతున్నది.  


ఎందుకంటే నిన్న రిలీజ్ చేసిన ఫోటోలు అనుష్క క్యూట్ గా ఉండటం.. ఎయిర్ పోర్ట్ ఫొటోలో అనుష్క బొద్దుగా ఉండటంతో.. రాజమౌళి బాటలోనే అనుష్కను గ్రాఫిక్స్ లో చాలా వరకు సన్నగా చేసి చూపించేందుకు నిర్మాతలు లక్షలు ఖర్చు పెడుతున్నారేమో అనిపిస్తున్నది.  సినిమాపై ఉన్న నమ్మకంతోనే ఇలా ఖర్చు చేస్తుండొచ్చు. సోలో హీరోయిన్ గా చేస్తున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉన్నది.  అరుంధతి తరువాత అనుష్క మార్కెట్ అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా తరువాత ఏ సినిమా చేస్తున్నది అనే విషయం తెలియాల్సి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: