చిరంజీవి మెగాస్టార్ గా అశేష్ ప్రేక్షకాభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవటానికి ప్రధాన కారణం ఆయన డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ. కెరీర్ తొలినాళ్ల నుంచే వీటిపై తనదైన ముద్ర వేసారు చిరంజీవి. ఆయన ప్రతి సినిమాలో ఇవే కోరుకునే ప్రేక్షకాభిమానులను చిరంజీవి ఎప్పుడూ నిరుత్సాహపరచింది లేదు. మరి.. రాబోయే సైరా.. నరసింహారెడ్డి సినిమాలో ఇవన్నీ ఉన్నాయా..!

 


సైరా నరసింహారెడ్డి ఓ ప్రత్యేకమైన సినిమా. చారిత్రక గాధ. ఇందులో భావోద్వేగాలకు మాత్రమే ప్రధాన పీట వేయగలరు. చరిత్రను చెప్పేటప్పుడు ఎంతగా కథలో లీనమైపోయేలా చేయగలిగితే సినిమా అంత సక్సెస్ అవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి రెగ్యులర్ మూవీస్ లా పాటలు, డ్యాన్సులు, కామెడీ తక్కువనే చెప్పుకోవాలి. చిరంజీవి నుంచి ఇవి ఆశించేవారికి ఈ సినిమాలో ఉండకపోవచ్చు. ఇప్పటికే సినిమాలో రెండు పాటలు, ఓ దేశభక్తి గీతం మాత్రమే ఉంటుందని తెలిసింది. కథలో వీటిని కావాలని ఇరికిస్తే అసలు కథనానికే దెబ్బ పడుతుంది. చిరంజీవి సినిమా పాటల్లో ఆయన డ్యాన్స్, స్లో సాంగ్స్ లో ఆయనిచ్చే ఎక్స్ ప్రెషన్స్ తో సినిమా రేంజ్ ను మార్చేస్తారు చిరంజీవి. కేవలం పాటల గురించే ఆయన సినిమాలు హిట్ అయి వంద రోజులు ఆడిన సందర్భాలున్నాయి.

 


కాబట్టి చిరంజీవి అభిమానులు సైరా విషయంలో దీనిని అర్ధం చేసుకోవాల్సిందే. గతంలో హిట్లర్ సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాకు ముందు చిరంజీవి అంటే భారీ ఫైట్లు, డ్యాన్సులు ఉండేవి. కానీ చిరంజీవి గ్యాప్ తీసుకుని రెగ్యులర్ మసాలా తగ్గించి పూర్తి సెంటిమెంట్ తో ఆ సినిమా చేశారు. ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను ప్రిపేర్ చేసి సినిమా రిలీజ్ చేశారు. దాంతో హిట్లర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే ఫార్ములా పాటించక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: