కొణిదెల ప్రొడక్షన్ మెగాస్టార్ చిరంజీవి ఎంతో  ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ ‘సైరా నరసింహ్మారెడ్డి’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.  అయితే పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ మూవీ అనుకున్న దానికన్నా ఎక్కువే సూపర్ హిట్ అయ్యింది. దాంతో మెగాస్టార్ స్టామీనా ఏంటో చూసిన అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అని తెగ పొగిడేశారు.  దాంతో చిరంజీవి పై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి.  ఇక మెగాస్టార్ నటిస్తున్న సైరా మూవీపై ఈ మద్య రిలీజ్ అయిన ‘సాహెూ’ మూవీ ఎలాంటి ప్రభావం చూపుతుందా అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి. 


తాజాగా రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింమారెడ్డి ’ రూపొందింది.  1857 సిపాయిల తిరుగు బాటుకు ముందు బ్రిటీష్ సైన్యాన్ని గజ గజలాడించిని రేనాటి సూరీడు, తెలుగు ముద్దు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు..అందుకే ఎక్కడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ వెచ్చించారు. అయితే ఈ మూవీకి ఇప్పుడు సాహూ ఎఫెక్ట్ ఎమైనా పడుతుందా అంటే అవుననే చెబుతున్నారు.  


సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సాహెూ’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ 350 కోట్ల బడ్జెట్ తో తీశారు.  కానీ సరైన కథనం లేకపోవడంతో ఈ మూవీ మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  కాకపోతే ప్రభాస్ కి ఉన్నక్రేజ్ తో కొంత వరకు వసూళ్లు బాగానే చేస్తున్నారు..సైరా ఏ రేంజ్ లో ఆ కవరింగ్ చేస్తుంది.. ఒకవేళ హిట్ టాక్ వచ్చినా..ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ‘సైరా’ తెరకెక్కిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: