రాబోతున్న సంక్రాంతి సీజన్ మహేష్ అల్లు అర్జున్ ల సినిమాల మధ్య వార్ గా మారడంతో ఈ వార్ లో ఎవరు విజేత అన్న విషయాన్ని పక్కకు పెట్టి ఒక వీకెండ్ డేట్ కోసం వీరిద్దరూ పట్టుబడుతున్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రిలీజ్ డేట్ ను ఇప్పటికే జనవరి 10 అని ప్రకటించారు. దీనితో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ మూవీని జనవరి 12న విడుదల చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడాయి. 

ఇప్పుడు ఈ రిలీజ్ డేట్స్ క్లాష్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సమస్యలేదు కాని ఓవర్సీస్ రిలీజ్ కు మాత్రం సమస్యగా మారింది అని అంటున్నారు. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలకు ఓవర్సీస్ కలక్షన్స్ తో పాటు ఓవర్సీస్ ప్రీమియర్ షోల కలక్షన్స్ కూడ కీలకంగా మారుతున్నాయి. 

అయితే అల్లు అర్జున్ మూవీని జనవరి 12న కాని లేదంటే సంక్రాంతి పండుగరోజున కాని విడుదల చేస్తే ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఇబ్బంది ఉండదు కాని ఓవర్సీస్ లోని తెలుగు ప్రేక్షకులకు ఇబ్బంది. దీనికి కారణం ఈసారి సంక్రాంతి పండుగ సోమ మంగళ వారాలలో వచ్చింది. 

దీనితో బన్నీ సినిమాను పండుగ రోజున విడుదల చేస్తే ఓవర్సీస్ లో ఆరోజు వర్కింగ్ డే కాబట్టి ఎవరు చూడరు. దీనితో ఈమూవీకి ఓపెనింగ్ కలక్షన్స్ రావు. ఓవర్సీస్ వీకెండ్ కలక్షన్స్ అన్నీ మహేష్ సినిమా చుట్టేస్తుంది. దీనితో తన సినిమాను కూడ మహేష్ మూవీ విడుదలయ్యే జనవరి 10 లేదంటే ఒక్కరోజు గ్యాప్ తో 11న విడుదల చేసి మహేష్ తో డైరెక్ట్ ఫైట్ కు దిగాలని బన్నీ భావిస్తున్నట్లు టాక్. ఓవర్సీస్ కలక్షన్స్ కోసం అటు మహేష్ ఇటు బన్నీ డైరెక్ట్ ఫైట్ కు దిగుతూ ఉండటం ఈ రెండు భారీ సినిమాలకు మంచిదికాదు అంటూ ఈమూవీ బయ్యర్లు భావిస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: