గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ యురేనియం మైనింగ్ దందా పై దృష్టిపెట్టి దానిపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ‘సేవ్ నల్లమల’ అంటూ ఒక ఉద్యమానికి నిన్న రాత్రి తన ట్విటర్ ద్వారా పిలుపును ఇవ్వడం రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది.

బంగారు తెలంగాణ పేరుతో కాలుష్యం నిండిన తెలంగాణాను భవిష్యత్ తరాలకు ఇవ్వబోతున్నామా అంటూ పవన్ ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులను టార్గెట్ చేస్తూ సూటి ప్రశ్నలు వేసాడు. ఇదే సందర్భంలో పవన్ ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాటలను కూడ కోట్ చేసాడు. ‘భూమి ప్రజలకు సంబంధించిన ఆస్థి కాదు. భూమి భవిష్యత్ తరాలను కొనసాగించే సంపద’ అంటూ తన ట్విట్ ముగించాడు. 

ఈ మధ్యనే పవన్ నల్లమల ఫారెస్ట్ పరిరక్షణ ఉద్యమానికి చేస్తున్న కృషికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు సంఘీభావం చెప్పిన విషయం తెలిసిందే. ఈ యురేనియం మైనింగ్ దందా వల్ల తెలంగాణాలోని కొన్ని జిల్లాల ప్రజలకు లంగ్ క్యాన్సర్ కిడ్నీ సమస్యలు రాబోతాయని చెపుతున్నా ఎవరు పట్టించుకోకుండా ఈ దందా నడవడం పై పవన్ తన తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచారు.  

అయితే పవన్ ఎత్తుకున్న ఈ సామాజిక ఉద్యమాన్ని మధ్యలో వదిలేయకుండా చివరి వరకు కొనసాగించగలిగితే పవన్ తెలంగాణ ప్రజలలో నిజమైన సూపర్ పొలిటికల్ స్టార్ గా మారిపోతాడు. తెలంగాణ ప్రాంతంలోని 48 గ్రామాలకు సంబంధించి 70 వేలమందికి ఆరోగ్య సమస్యలు రాకుండా రక్షించే ఈ సామాజిక ఉద్యమాన్ని ప్రజలలోకి పవన్ సీరియస్ గా తీసుకువెళితే తెలంగాణ రాష్ట్ర అధినాయకత్వానికి ఊహించని తలనొప్పులు వచ్చే ఆస్కారం ఉంది అని రాజకీయ విశ్లేషకుల భావన.. 


మరింత సమాచారం తెలుసుకోండి: