మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం "సైరా". కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదలకు సిద్ధం అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుంటుంది.  ఖైదీ నంబర్ 150 తర్వాత చిరంజీవి చేస్తున్న ఈ చిత్రంపై అందరికీ అంచనాలు భారీగా ఉన్నాయి. నిజానికి ఈ సినిమాని తన నూట యాభైయవ చిత్రంగా తెరకెక్కించాలని అనుకున్నారు.


కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. భారీ తారాగణంతో, భారీ తారాగణంతో వస్తున్న ఈ చిత్రానికి స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఉన్న పిరియాడిక్ చిత్రాలను తీసే అనుభవం లేకపోయినా సురేందర్ రెడ్డికి ఈ బాధ్యతను అప్పగించారు రామ్ చరణ్. అయితే సురేందర్ రెడ్డి అన వంతు బాధ్యతని సరిగ్గా పోషించాడని అంటున్నారు. ఇక ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు.


ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ట్రెండింగ్ లో నిలవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో "సైరా" రికార్డులు తిరగరాసే దిశగా పరుగులు పెడుతుంది. అయితే ఈ సినిమాలోని బలాల గురించి ప్రస్తావించిన సురేందర్ రెడ్డి కొన్ని ముఖ్యమైన సీన్ల గురించి వివరించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలవనున్నాయట.


అవేంటంటే, అన్నిటికన్నా ఎక్కువగా క్లైమాక్స్ కంటే ముందుగా యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవనుందట. ఆ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కుర్చీలకే అతుక్కుపోయేలా చేస్తాయని అన్నారు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వచ్చే సన్నివేశాలు కూడా హైలైట్ అవుతాయని అన్నాడు. ఈ సీన్స్ ని అండర్ వాటర్ లో చిత్రీకరించామని, దానికోసం ముంబయిలోని భారీ స్విమ్మింగ్ పూల్ ని వాడామని  చెబుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: