యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్నపూర్ణ బ్యానర్ తర్వాతే ఎవరైనా. అంటే మన్మధుడు తర్వాతే. నాగార్జున ఎప్పుడు కూడా ఒక కొత్త రచయిత లేదా కొత్త దర్శకుడు గనక కథ చెప్తే..ఒకవేల అది నాగ్ కి నచ్చితే ఏమాత్రం ఆలోచించకుండా తన బ్యానర్ లో వాళ్ళకి  డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాడు. అందుకు ఉదాహరణ ప్రముఖ కొరియో గ్రాఫర్ రాఘవ రాలెన్స్ కనిపించే ఉదాహరణ. లారెన్స్ ని డైరెక్టర్ ని చేసింది నాగార్జునే. ఆ తర్వాత లారెన్స్ డైరెక్టర్ గా ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మరో కొత్త దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడట మన మన్మధుడు. తన కెరీర్ ముందు నుంచి ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్న నాగ్ ఇటీవల వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. 

అందుకే మళ్లీ మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి, హిట్ కొట్టే ఆలోచనలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. రీసెంట్‌గా సూపర్ హిట్ అయిన మహర్షి సినిమా రైటర్లలో ఒకరైన సోలోమన్  చెప్పిన కథ విని, ఆ కథ నాగ్ కి బాగా నచ్చడంతో అతనికే డైరక్షన్ అవకాశం ఇవ్వాలని నాగ్ నిర్ణయించుకున్నాడని లేటెస్ట్ న్యూస్. నాగ్ సన్నిహిత బ్యానర్ మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మించబోతున్నారట. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్, ఈ ప్రాజెక్టు మీదే కొన్ని రోజులుగా డిస్కషన్లు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే, ప్రాజెక్టు త్వరలో ప్రారంభించాలన్నది నాగ్ ఐడియా అని తెలుస్తోంది.

ఇదిలావుంటే నాగ్ ఎప్పటి నుంచో అనుకుంటున్న డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమా ఇంకా మొదలవకుండా పెండింగ్ లోనే వుంది. అది సెట్ మీదకు వెళ్లాలి. అంటే చైతన్య కూడా రెడీ కావాలి. కానీ నాగ్ డేట్ లు సెట్ అయితే చైతన్య బిజీగా వుంటున్నాడు. చైతన్య రెడీ అయితే నాగ్ బిజీగా వుంటున్నాడు. వాస్తవంగా మన్మధుడు-2 తర్వాత వెంటనే బంగార్రాజు మొదలుపెట్టాలనుకున్నాడు నాగార్జున. కానీ తండ్రి-కొడుకులకి డేట్స్ సెట్ అవకపోవడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతు వస్తుంది.  దాంతో డైరక్టర్ కళ్యాణ్ కృష్ణను మాత్రం ఖాళీగా వుంచుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: