నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం "గ్యాంగ్ లీడర్". ఈ చిత్రం సెప్టెంబర్ పదముడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జెర్సీ సినిమా తర్వాత నాని చేస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. జెర్సీలో తన అద్భుత నటనతో అందరినీ ఆకర్షించిన నాని ఈ సినిమా ద్వారా ఎటువంటి మాయ చేస్తాడనేది చూడాలి. అయితే గ్యాంగ్ లీడర్ చిత్ర భారమంతా నాని ఒక్కడే మోస్తున్నాడు.


ఎందుకంటే ఈ సినిమాలో మనకు తెలిసిన మోహాలు చాలా తక్కువ. నాని గ్యాంగ్ లో ఉన్న వాళ్ళలో ఒకరిద్దరు తప్పితే మిగతా అంతా కొత్తవారే. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేవాళ్ళలో నాని ఒక్కడే ఉన్నాడు. విలన్ గా నటించిన కార్తికేయ ఉన్నప్పటికీ వరుస ఫ్లాపుల తర్వాత కార్తికేయకి ఉన్న ఇమేజ్ పడిపోయిందనే చెప్పవచ్చు. అదీగాక షర్ట్ విప్పి బాడీ చూపించడం తప్పితే పెద్దగా చేసేదేం లేదు అనే ట్యాగ్ లైన్ ని మూటగట్టుకున్న కార్తికేయ ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఏ కోశాన కనబడట్లేదు.


ఇక దర్శకుడి విషయానికొస్తే "మనం" తర్వాత ఆయన కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. సూర్యతో చేసిన 24, అక్కినేని అఖిల్ తో చేసిన హలో సినిమాలు ఏమంత పేరు తీసుకురాలేదు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయాన్ని చవిచూశాయి. మరి అలాంటి దర్శకుడు తీసిన సినిమా మీద ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలు లేవనేది వాస్తవం.


ఇక సినిమాలో ఉన్న హీరోయిన్ నే తీసుకుంటే, ఆమె హీరోయిన్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కనిపించిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలు ఆమెలో కనబడట్లేదని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో సినిమాలో గ్యాంగ్ భారమే కాదు. సినిమాకి జనాల్ని తెప్పించే బాధ్యత కుడా నాని మీదే పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లకి విశేష స్పందన లభించింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే పదమూడు వరకు వెయిట్  చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: