అందం, అభినయం అన్నీ ఉన్నా టాలీవుడ్ అందాల చందమామ కాజల్‌కి లక్ కలిసి రావడం లేదు. పవన్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్‌లతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన కాజల్ కెరియర్ డౌన్ అవుతూ వస్తోంది. ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ చిత్రంతో డిజాస్టర్ అందుకుంది. తాజాగా శర్వానంద్ ‘రణరంగం’ చిత్రంలోనూ నటించింది. ఈ సినిమాకు మిక్స్ డ్‌ టాక్ వచ్చింది.


‘పారిస్ పారిస్’. షూటింగ్ పూర్తయ్యి చాలా రోజులైంది. నిజం చెప్పాలంటే కొన్ని నెలలు గడిచింది. కానీ, ఇంకా విడుదలకు మాత్రం నోచుకోలేదు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘క్వీన్’కు ఇది రీమేక్. హిందీలో కంగనా రనౌత్ చేసిన పాత్రను కాజల్ పోషించారు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. ఇదే సినిమాను తెలుగు, మలయాళం, కన్నడలో కూడా తెరకెక్కించారు. తెలుగులో తమన్నా, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పారుల్ యాదవ్ ప్రధాన పాత్రలు పోషించారు.చిరు, కొరటాల సినిమా గురించి కాజల్ మాట్లాడుతూ.. ఆ చిత్రం కోసం నన్నెవరూ సంప్రదించలేదు. చిరు సర్ సినిమా కోసం నన్ను అడగలే కానీ ఎందుకు చేయను. సంతోషంగా ఒప్పుకుంటా అని కాజల్ సమాధానం ఇచ్చింది. ఇక కాజల్ కు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ సరసన నటించే ఛాన్స్ కూడా వచ్చింది. భారతీయుడు 2 కోసం కాజల్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 


తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ కి మంచి క్రేజ్ వుంది. ఇక హిందీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. ఒక వైపున స్టార్ హీరోలతో జోడీ కడుతూనే, 'సీత' వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. అంతేకాదు తనకి నచ్చితే స్పెషల్ సాంగ్స్ లోను మెరుస్తోంది. 'పక్కా లోకల్' వంటి స్పెషల్ సాంగ్ తో ఆమె కుర్రకారులో హుషారెత్తించింది. అలాంటి కాజల్ కి 'సాహో' నుంచి అవకాశం వ‌చ్చిందనే ఒక వార్త ఆలస్యంగా బయటికి వచ్చింది. 


'సాహో' సినిమాలో 'బ్యాడ్ బాయ్' సాంగ్ చాలా పాప్యులర్ అయింది. ఈ సాంగ్ కోసం ముందుగా కాజల్ ను సంప్రదించారట. ప్రభాస్ తో గల సాన్నిహిత్యం కారణంగా, ఈ ప్రాజెక్టుకు గల క్రేజ్ కారణంగా వెంటనే కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ ఆ తరువాత ఈ సినిమా టీమ్ మనసు మార్చుకుని జాక్విలిన్ ఫెర్నాండేజ్ ను తీసుకున్నారు. ఈ పాటలో చేసినందుకు పారితోషికంగా ఆమె 2 కోట్లు తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: