నేచురల్ స్టార్ నాని ఎందుకనో ఎప్పటికప్పుడు తన సినిమాతో కొత్త హీరోయిన్ ని, తెలుగు తెరకు, ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటాడు. ఇప్పటివరకు కీర్తి సురేష్ తప్ప మిగత అందరు దాదాపు కొత్త వాళ్ళతోనే నటించాడు. తన సినిమాల ద్వారా ఇప్పటికే కొందరు హీరోయిన్స్ ను పరిచయం చేసిన నాని ఇప్పుడు  'నానీస్  గ్యాంగ్ లీడర్' ద్వారా ప్రియాంక అరుళ్ అనే అమ్మాయిని  హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. అయితే ఈ విషయంలోనే ఫిల్మ్ నగర్ లో ఒక గాసిప్ గుప్పుమనింది. అదేంటంటే ఇప్పటి వరకు నాని పరిచయం చేసిన హీరోయిన్స్ లో మెహ్రీన్ - నివేత థామస్ మినహా మిగతా వాళ్ళకి తెలుగులో ఛాన్స్ లు కూడా దక్కలేదు. జెర్సీ తో పరిచయమైన శ్రద్దా శ్రీనాథ్ కి ప్రస్తుతం దరిదాపుల్లో కూడ ఒక అవకాశం కనిపించడం లేదు. 'మజ్ను' తో హీరోయిన్ గా పరిచయమైన అను ఇమాన్యుయేల్ పరిస్థితి ఇంతే. వాణి కపూర్ అడ్రసే లేదు. 

ఇక ఇప్పుడు ప్రియాంక పరిస్థితేంటో.. అనే ప్రశ్న కు స్మూత్ గా చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. ప్రియాంక ను గుర్తుపెట్టుకోండి గొప్ప హీరోయిన్ అవుతుంది. ఇక ముందు మీడియా తనని మళ్ళీ మళ్ళీ కలుస్తుంటుంది అంటూ ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అయితే నిజంగానే ప్రియాంక కి అంతా సీన్ ఉందా..? అనే విషయం రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. గతంలో నివేతా థామస్ విషయంలో కూడా ఇలానే చెప్పాడు. నివేతా లో మంచి టాలెంట్ ఉన్నప్పటికి తన కెరీర్ నత్త నడకలా సాగుతోంది. 

అందరికి తెలిసిన విషయం ఏమిటంటే నాని సినిమాల్లో హీరోయిన్ ని చాలా సందర్భాల్లో తన నటనతో డామినేట్ చేస్తుంటాడు. కానీ గ్యాంగ్ లీడర్ లో పెద్ద గ్యాంగ్ ఉంది. అంతమందిని దాటి ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో నెట్టుకొట్టుస్తుందా..లేదా తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. మరి ప్రియాంక ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటూ టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకోగలదా..చూడాలి. ఇప్పటికి ప్రియాంక కన్నడ లో ఒక సినిమా మాత్రమే చేసింది. అంతగా గుర్తింపు లేని ఈ అమ్మాయిని నాని తెలుగులోకి తీసుకు రావడానికి కారణం ఏంటో తెలీదు గాని ఈ అమ్మాయి మాత్రం ఈ సినిమా మీద గట్టి ఆశలే పెట్టుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: