మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఎవరూ ఊహించని విధంగా తలాక్ బిల్లును ప్రవేశపెట్టి రాజ్యసభలో ఆమోదం పొందేలా చూశారు.  ఈ బిల్లు ఆమోదం పొందటంతో.. కొన్నిరోజుల గ్యాప్ తో జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.  నాటకీయ పరిణామాల మధ్య ప్రవేశపెట్టిన ఈ బిల్లు క్షణాల్లో ఆమోదం పొందింది.  సాయంత్రం వరకు ఓటింగ్ పూర్తయింది.  రాష్ట్రపతి ఆమోదం పొందటంతో 72 సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్యను 72 గంటల్లోనే పరిష్కరించారు.  


దీనితరువాత ప్రజల సేఫ్టీని ఉద్దేశించి కొత్త వాహన చట్టం అమలు చేస్తున్నారు.  ఇది కూడా సత్పలితాలను ఇస్తున్నది.  చట్టాలను కఠినం చేసినపుడు అప్పటి వరకు పాటించకుండా తిరిగిన మనకు కొంతకాలం కష్టంగా ఉంటుంది.  ఒకసారి రూల్స్ ను పాటించడం అలవాటు చేసుకుంటే.. చాలా హ్యాపీగా ఉంటుంది.  ఎలాంటి ఇప్పందులు ఉండవు.  ఇదిలా ఉంటె, మహాత్మాగాంధీ 150 వ జయంతి సందర్భంగా మోడీ మరో నిర్ణయం తీసుకున్నారు.  


దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత భారతాన్ని తీసుకురావాలని అనుకున్నారు.  అనేక సభల్లో మోడీ ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు.  ఈ ఐడియా బాగుందని చాలామంది సపోర్ట్ చేశారు.  బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ ఐడియాను మెచ్చుకుంటున్నారు. అమిర్ ఖాన్ తో సహా అందరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు రెడీ అవుతున్నారు.  ఒకరిద్దరు కాకుండా ఇప్పుడు సినిమా యూనిట్ అంతా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నట్టు ప్రకటించింది. 


ఆ సినిమా యూనిట్ మరేదో కాదు. కూలీ నెంబర్ 1 యూనిట్.  వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది.  ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించి.. వాటి స్థానంలో స్టీల్ బాటిల్స్ ను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు.  దానికి సంబంధించిన ఫోటోను షేర్ యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  దీనిపై ప్రధాని మోడీ స్పందించారు.  ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ యూనిట్ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.  ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదించాలని అప్పుడే ప్లాస్టిక్ రహిత భారతం సాధ్యం అవుతుందని మోడీ పేర్కొన్నారు.  నేను కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ఈరోజు నుంచి నిషేధిస్తున్నారు.  అందరం చేతులు కలిపితేనే ఇది సాధ్యం అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: