తెలుగు లో బిగ్ బాస్ 3 ఇప్పటికీ ఏడో వారం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.  50 రోజులు దాటిన బిగ్ బాస్ లో ప్రస్తుతం ఫినాలేపై దృష్టి పెట్టుకొని ఆడాల్సిందిగా బిగ్ బాస్ ఆర్డర్ వేశారు.  ఇప్పటి వరకు ఇంట్లో అటలు,ఆనందాలు,అల్లర్లు చాలని..ఇకనుంచి ఫైనల్ దృష్టి లో పెట్టుకొని సీరియస్ గా గేమ్స్, టాస్క్ లు ఆడాలని అన్నారు.  దాంతో బిగ్ బాస్ లో ఎవరి పర్ఫామెన్స్ వారు ఇరగదీస్తున్నారు.  అయితే బిగ్ బాస్ లో కూతురు పై తండ్రి సీరియస్ కావడం ఏంటీ..అది ఎక్కడా కనిపించలేదే అని ఆశ్చర్యపోకండి...ఇది తెలుగులో కాదు, తమిళంలో కమల్ హాసన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 లో పేరెన్స్ కి ఎంట్రీ ఇచ్చారు.  దీంతో తమవారిని చూసిన హౌస్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు. కొంతమంది ఆనందంతో ఏడ్చేశారు. అయితే నటి, యాంకర్ లోస్లియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. 

చాలా కాలం తర్వాత తన తండ్రిని చూడటంతో భావోద్వేగానికి గురైంది లోస్లియా.  కానీ ఆమె తండ్రి ప్రవర్తన చూసి అందరూ షాక్ తిన్నారు..తండ్రి వద్దకు లోస్లియా వెళ్లగానే నీ ప్రవర్తన చాలా చండాలంగా ఉందని..నేను నిన్ను ఇలాంటి పద్దతిలోనే పెంచానా? అని తీవ్ర స్వరంతో ఆగ్రహించారు.  అసలు విషయానికి వస్తే..లోస్లియా బిగ్ బాస్ హౌజ్ లోని కెవిన్ తో క్లోజ్ గా ఉంటోంది. వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో లోస్లియా తండ్రి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆమె అందరి ముందు తలదించుకొని కన్నీరు పెట్టుకుంది.  మరో కంటెస్టంట్ చేరన్.. లోస్లియా తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఆ తరువాత లోస్లియా తండ్రిని హత్తుకొని ఏడ్చింది. అయితే లోస్లియా తండ్రి వ్యవహారంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.  బిగ్ బాస్ లో కంటిస్టెంట్ల మద్య ఆమాత్రం స్నేహ సంబందాలు ఉంటాయని..వారు ఎప్పుడు వెళ్లి పోతారో తెలియదని అందమాత్రాన ఇంటి సభ్యుల మద్య లోస్లియాను తిట్టడం ఎంత వరకు సమంజసం అని అంటున్నారు నెటిజన్లు.  లోస్లియా-కెవిన్ ల మధ్య లవ్ ఎఫైర్ సాగుతున్నట్లు హైలైట్ చేస్తోన్న హోస్ట్ కమల్ హాసన్, బిగ్ బాస్ లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: