సినిమాలలో అవకాశాలు ఇస్తామంటూ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి వేధింపులు ఒక ఎత్తు అయితే.. అయినవాళ్ళ కారణంగా దారుణమైన హింసను ఎదుర్కొనే చేదు అనుభవాలు మరికొందరికి ఎదురవుతూ ఉంటాయి. కన్నడ నటిగా.. బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్ గా అందరికి పరిచయమున్న జయశ్రీ రామయ్య తాజాగా వార్తల్లోకి వచ్చారు. ఆస్తి కోసం తన మేనమామ తనను శారీరకంగా..మానసికంగా హింసిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనం అయింది. ఇలాంటి చేదు అనుభవాలు గతంలో కూడా అంజలి, అవికా గోర్ వంటి వాళ్ళకి ఎదురయ్యాయన్న సంగతి తెలిసిందే.

నటిగానే కాదు.. మంచి డ్యాన్సర్ గా జయశ్రీ బాగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. ఇక తనతో పాటు.. తన తల్లిని కూడా మేనమామ గిరీశ్ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సీకె అచ్చుకట్టె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జయశ్రీ. బెంగళూరులోని హనుమంత నగర్ లో ఉన్న తమ ఇంటికి అర్థరాత్రి వేళ వచ్చి గొడవపడ్డారని.. తన తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని వాపోయింది జయశ్రీ. అలాంటి సమయంలో కూడా తను ఏంచేయాలో అర్థం కాక బాధను భరించానని వెల్లడించింది.

అంతేకాదు తాను ధరించే వస్త్రాల మీద కూడా దారుణమైన వ్యాఖ్యలు చేస్తాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. జయశ్రీ కంప్లైంట్ ను తీసుకున్న పోలీసులు ముందు ఈ విషయం మీద విచారిస్తామన్నారు. నటి కంప్లైంట్ నేపథ్యంలో ఆమెతో పాటు గిరీశ్ ను కూడా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం కేసు రిజిస్టర్ చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సమాజంలో సామాన్య మహిళల దగ్గర్నుంచి కాస్త పేరున్న సినిమా సెలబ్రిటిస్ వరకు అందరు ఇలాంటి అరాచకాలను భరిస్తున్నారు. అయితే కొద్ది మంది మాత్రమే ధైర్యం చేసి కంప్లైంట్ ఇస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: