ఎక్స్‌ఫోజింగ్ చేయడానికి కొత్తగా వచ్చిన అమ్మాయిల దగ్గర్నుంచి కాజల్, రకుల్ లాంటి స్టార్ హీరోయిన్స్ దాకా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ఇక స్కిన్ షోలోనూ కొంగొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒక్క సినిమాతోనే ఆ లిస్ట్ లో చేరిన బ్యూటీనే పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ సినిమాలోనే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారి.. అందరి నోట్లో నానింది. కొద్దిమంది హీరోయిన్స్ లా కాకుండా.. సెక్స్ అన్న పదాన్ని సింపుల్ గా పలికేయటమే కాదు.. ఇంకా ఇలాంటి చాలా విషయాల్ని ఓపెన్ గా మాట్లాడేస్తుంటుంది.
ఏది ఏమైనా పాయల్ అందానికి.. తన నటనకు ఫిదా అయ్యారు యూత్. డేరింగ్ పాత్రను నటించిన ఈ బ్యూటీ.. తాజాగా ఆర్డీఎక్స్ సినిమాలో మరింత హాట్ హాట్ గా, సెక్సీగా చెలరేగిపోయింది. ఈ సినిమా టీజర్ విడుదలయ్యాక ఒక వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు రాగా రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ లో మాత్రం ఆ సినిమా కేవలం సెక్స్ చుట్టూనే కాదు.. ఇంకా చాలా విషయాల మీద ఫోకస్ చేసిందన్న ఆలోచన కలిగేలా చేసింది.

పాయల్ నటించిన ఆర్డీఎక్స్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహిళలు ఎదుర్కొనే చాలా సమస్యల్ని.. విషయాల్ని వెల్లడించింది. నెలసరి వేళ అమ్మాయిలు పడే కష్టాలు.. సెక్స్ కు ముందు వాడే కండోమ్ ల గురించి.. సెక్స్ గురించి.. సేఫ్టీ గురించి..ఇలా చాలా విషయాల్ని సినిమాలో చూపించినట్లు తెలిపింది.

ఇలాంటి విషయాలు చెప్పటానికి కొంతమంది హీరోయిన్స్ సిగ్గు పడటమో.. భయపడటమో చేస్తారు. ఇంకా చెప్పాలంటే షుటింగ్ అవగానే ప్రమోషన్స్ కి రాకుండా సైలెంట్‌గా ఉండిపోతారు. కానీ పాయల్  మాత్రం ఈ సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నట్లు చెప్పింది. ఇప్పటికే టీజర్.. ట్రైలర్ తో ఆర్డీఎక్స్ లవ్ మూవీ హాట్ టాపిక్ గా మారి.. సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తిని క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యింది. ఇక పాయల్ ఈ సినిమా తర్వాత మాస్ మహారాజ రవితేజ తో డిస్కోరాజా, వెంకీ సరసన మరో సినిమాలోను నటిస్తోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: