తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ ప‌డుతూ లేస్తూ ఓ మోస్త‌రుగా న‌డుస్తోంది. హౌస్‌లో ఇప్పటికీ ఏడువారాలు పూర్తయ్యాయి. ఎనిమిదో వారంలో అడుగుపెట్టిన హౌస్‌మేట్స్‌.. నామినేషన్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు కంటెస్టెంట్లు నామినేష‌న్లో అడుగు పెట్టారు. ఇక ఎనిమిదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు శ్రీముఖి, శిల్పా, హిమజ, పునర్నవి, మహేష్‌ నామినేట్‌ అయ్యారు. ఇక ఈ వారం బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ బిగ్‌బాస్‌కే తలనొప్పిగా మారింది. 


కొంద‌రు ఏకంగా బిగ్‌బాస్‌కే ఎదురు తిరిగారు. టాస్క్‌లో చెత్త పర్ఫామెన్స్‌ ఇచ్చిన శ్రీముఖి, మహేష్‌, పునర్నవిలకు షూస్‌ పాలిష్‌చేసే టాస్క్‌ను పనిష్మెంట్‌గా ఇచ్చాడు. ఈ ప‌నిష్మెంట్‌ను చేసేందుకు శ్రీముఖి, మ‌హేష్ ఒప్పుకోగా పున‌ర్న‌వి ఒప్పుకోలేదు. చివ‌ర‌కు వ‌రుస‌గా రెండు వారాల పాటు నామినేష‌న్‌కు ఎంపిక‌వుతార‌ని వార్నింగ్ ఇవ్వ‌డంతో పున‌ర్న‌వి దిగివ‌చ్చి షూలు పాలీస్ చేసింది. ఇక గురువారం ఎపిసోడ్‌లో కొత్త కెప్టెన్ ఎంపిక ప్ర‌క్రియ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు కెప్టెన్‌గా ఎంపిక కాని వారిని హౌస్‌మెట్స్ ఏకాభిప్రాయంతో చెప్పాల‌ని బిగ్‌బాస్ సూచించారు. కొత్త కెప్టెన్ కోసం 


బరువులెత్తగలవా జెండా పాతగలవా అనే టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్‌లో వితికా, శ్రీముఖి, శివజ్యోతిలను వరుణ్‌, రవి, మహేష్‌లు ఎత్తుకుని అటు ఉన్న జెండాలను ఇటు పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో వ‌రుణ్ - వితిక జోడీ 22 జెండాలు పెట్ట‌గా, శివ‌జ్యోతి - మ‌హేష్ జోడీ 21 జెండాలు, ర‌వి - శ్రీముఖి జోడీ 20 జెండాలు పెట్టింది. ర‌వి శ్రీముఖిని మోసేందుకు నానా క‌ష్టాలు ప‌డ్డాడు. చివ‌ర‌కు ఎక్కువ జెండాలు పెట్టిన వితిక విన్ అయ్యి బిగ్ కొత్త కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ సీజ‌న్లో రెండో లేడీ కెప్టెన్‌గా వితిక రికార్డుల‌కెక్కింది. ఇప్పటికే శివజ్యోతి కెప్టెన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక ఇప్ప‌టికే ప‌లుసార్లు కెప్టెన్ టాస్క్ కోసం పోటీప‌డిన శ్రీముఖి మ‌రోసారి ఫెయిల్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: