తెలుగు వెండితెర చందమామగా కాజల్ కు పేరుంది. కేవలం అందంతోనే కాకుండా.. అభినయంతోనూ మెప్పించిన కొద్ది మంది స్టార్స్ లో కాజల్ ఒకరు. అందుకే దశాబ్దకాలంపైగా ఆమె హీరోయిన్ గా వెలుగొందుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఈ చందమామకు అంతగా హిట్స్ రావడం లేదు.


ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమాలు కూడా హిట్ కావడవం లేదు. దీనికి తోడు టాప్ హీరోలెవరూ పెద్దగా కాజల్ ను ఇప్పుడు తమ పక్కన కోరుకోవడం లేదు. పాపం కాజల్ ఎంతగానో ఆశ పెట్టుకున్న సీత, కవచం, ఎమ్మెల్యే చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.


కాస్తో కూస్తో గటెక్కిస్తుందనుకున్న రణ రంగం కూడా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. అసలు ఈ సినిమాలో కాజల్ ఎందుకు నటించింది అంటూ రివ్యూల్లో ప్రశ్నలు తలెత్తే రేంజ్ లో ఆమెకు ప్రాధాన్యం లేని పాత్రకు ఓకే చెప్పేసిందట. అలా ప్రస్తుతం కాజల్ నిరాశలో ఉంది.


ప్రస్తుతం ఆమె చేతిలో స్టార్స్ సినిమాలేవీ లేవు.. కేవలం కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రం మాత్రమే ఆశాజనకంగా ఉంది. అయితే అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. ఎప్పుడు రిలీజవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది.


తన తాజా అందాల ఫోటో షూట్ ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ ప్రముఖ కంపెనీ ప్రచారం కోసం నిర్వహించిన ఫోటో షూట్ ను కాజల్ తన ఇన్‌ స్టా గ్రామ్‌లో పోస్టు చేసింది. వన్నె తగ్గిందని టాక్ వస్తున్న చందమామలో అందాల విందుకు కొరతేమీ లేదన్నట్టుగా ఈ ఫోటో షూట్ ఉంది. రాయల్ లుక్ తో .. పిచ్చెక్కించే ఫోజులతో ఈ ఫోటో షూట్ ఆమె అభిమానులకు పిచ్చెక్కించేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: