కింగ్ నాగార్జునకు వరుసగా ఎన్ని ఫ్లాపులొచ్చినా సరే తను చేయాల్సిన ప్రయోగాలను మాత్రం ఆపరని తెలిసిందే. శివ సినిమాతో ఆర్జివిని ఇంట్రడ్యూస్ చేసిన నాగార్జున ఇప్పటికి కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం నాగ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఎన్నో భారీ అంచనాల మధ్యన వచ్చిన మన్మథుడు 2 కూడా ఫ్లాప్ అయ్యింది.


అయితే మన్మథుడు 2 ఫ్లాప్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న నాగ్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నారట. అసలైతే నాగార్జున కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో బంగార్రాజు సినిమా చేయాల్సి ఉంది. కాని ఆ సినిమా అనివార్య కారణాల వల్ల మళ్లీ వాయిదా పడ్డదట. ఈలోగా నాగ్ సోలమాన్ చెప్పిన కథకు బాగా కనెక్ట్ అయ్యాడని తెలుస్తుంది.


వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమా కథ విషయంలో సోలమాన్ హ్యాండ్ ఉంది. అయితే నాగార్జున ఇమేజ్ కు తగిన కథతో సోలమాన్ కలిశాడట. అది నచ్చిన నాగ్ వెంటనే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. కొత్త వాళ్లతో కెరియర్ రిస్క్ అని తెలిసినా మళ్లీ మళ్లీ అదే రూట్ ఎంచుకుంటారు నాగార్జున.   


మన్మథుడు 2 షాక్ ఇచ్చినా సరే సోలమాన్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నిజంగా ఇలా కెరియర్ రిస్క్ సాహసాలు చేయగల సత్తా కేవలం నాగార్జునకు మాత్రమే ఉందని చెప్పొచ్చు. సోలమాన్ నాగ్ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుంది. సినిమా కథ మహర్షికి దగ్గరగా ఉంటుందా.. అసలు ఆ సినిమా జానర్ ఏంటి అనే అంశాలు త్వరలో తెలుస్తాయి. నాగార్జున మెప్పించాడు అంటే సోలమాన్ కథలో విషయం ఉండే ఉంటుంది. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: