కొన్నాళ్ల క్రితం నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎంసిఏ సినిమా మంచి హిట్ సాధించి నటుడిగా ఆయనకు మంచి మాస్ ఇమేజిని తీసుకువచ్చింది. అయితే ఆ తరువాత వచ్చిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక ఇటీవల వచ్చిన జెర్సీ సినిమా, నానికి మంచి విజయాన్ని అందించడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా, నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా, నిన్న అర్ధ రాత్రి యుఎస్ఏ, యుఎఈ వంటి దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. అయితే ఆ షోల ద్వారా గ్యాంగ్ లీడర్ టాక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం. కొద్దిరోజులుగా నాని ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు వస్తున్న వార్తలు అన్ని ఒట్టి పుకార్లేనని సినిమా చూసిన వారు తేల్చేస్తున్నారు. 

ఇక ప్రారంభం కాస్త మెల్లగా మొదలైనప్పటికీ, కొంతసేపటి తరువాత సినిమా మంచి ఊపందుకుంటుందట. ఇక అక్కడక్కడా వచ్చే మంచి ఎంటర్టైనింగ్ సన్నివేశాలు సినిమాకు మంచి బూస్ట్ నిస్తాయని సమాచారం. ఆ తరువాత కమెడియన్ వెన్నెల కిశోర్ రంగ ప్రవేశంతో సినిమా మరింత ఫన్నీ గా సాగుతుందట. ఇక ఇంటర్వెల్ వరకు ఒకవిధంగా సాగిన సినిమా, ఇంటర్వెల్ ముందుకు వచ్చే ఇంటరెస్టింగ్ సీన్ తో ప్రేక్షకులకు సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా కాస్త మెల్లగానే ప్రారంభం అవుతుందని, అయితే కాస్త సినిమా గడిచిన తరువాత ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో పరిగెత్తుతూ, ఆ విధంగానే ప్రీ క్లైమాక్స్ వరకు సాగుతుందట, ఇక క్లైమాక్స్ ఎంతో ఎమోషనల్ గా ఉంటుందని, అలానే హృద్యమైన ఆ ఎమోషనల్ సీన్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని సమాచారం. ఇక మొత్తంగా చెప్పాలంటే మొదటి నుండి చివరి వరకు హీరో నాని ఈ సినిమాను తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ముందుకు నడిపించారట. 

ఇక హీరోయిన్ ప్రియాంక, సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్ లు తమ పాత్రలకు జీవం పోశారని, ఇక వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్, అనిరుద్ అందించిన ఫీల్ గుడ్ మ్యూజిక్, అలానే ఛేజింగ్ మరియు యాక్షన్ సీన్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్, స్కోర్, అదరగొట్టే ఫోటోగ్రఫీ, మరీ ముఖ్యంగా నెగటివ్ క్యారెక్టర్ లో కార్తికేయ పండించిన వండర్ఫుల్ పెర్ఫార్మన్స్, వెరసి ఈ గ్యాంగ్ లీడర్ ని మంచి సక్సెస్ఫుల్ సినిమాగా ముందుకు తీసుకెళ్తాయని అంటున్నారు. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు మంచి స్క్రీన్ ప్లే తో సాగె ఈ సినిమాని, చిన్నపిల్లల దగ్గరి నుండి ముసలి వారి వరకు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు. మరి ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పూర్తి స్థాయిలో ఏ విధమైన టాక్ ని సంపాదిస్తుందో చూడాలని, అయితే ప్రస్తుతం ప్రీమియర్ షోలకు వస్తున్న టాక్ ని బట్టి చూస్తే, గ్యాంగ్ లీడర్ ద్వారా మరొక హిట్ మూవీ నాని ఖాతాలో పడ్డట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: