నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈరోజు విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. నాని నటించిన కృష్ణార్జున యుధ్ధం, దేవదాస్ సినిమాలు ప్లాప్ కాగా జెర్సీ సినిమాకు హిట్ టాక్ వచ్చినా టాక్ కు తగిన కలెక్షన్లు రాలేదు. అందువలన నాని ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. కామెడీ మరియు సస్పెన్స్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాతో నాని ఖాతాలో మరో హిట్ పడినట్లే అని చెప్పవచ్చు. 
 
హీరో కార్తికేయ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ నాని సరసన హీరోయిన్ గా నటించింది. సినిమా ఒక దొంగతనం ఎపిసోడ్ తో మొదలై ఆసక్తికరంగా సాగుతుంది. నాని మరియు లేడీ గ్యాంగ్ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. నాని మరియు వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమాలో నాని చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. 
 
విలన్ కార్తికేయ నెంబర్ 1 కార్ రేసర్ పాత్రలో కనిపిస్తాడు. కార్తికేయ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కార్తికేయ మరియు గ్యాంగ్ మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. కథలో భాగంగా వచ్చే ట్విస్ట్ లు పేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సినిమాలోని పాత్రలకు అందరూ పూర్తిగా న్యాయం చేశారు. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుంది. 
 
మనం సినిమా తరువాత సరైన హిట్ లేని విక్రమ్ కె కుమార్ ఖాతాలో కూడా ఈ సినిమాతో మరో హిట్ పడినట్లే అని చెప్పవచ్చు. ఇష్క్, మనం సినిమాలతో హిట్ కొట్టిన విక్రమ్ కె కుమార్ కు హలో, 24 సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. గ్యాంగ్ లీడర్ సినిమాతో విక్రమ్ మరలా ట్రాక్ లోకి వచ్చినట్లే అని చెప్పవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: