‘సైరా’ విడుదల కాకుండానే దర్శకుడు సురేంద్ర రెడ్డికి రామ్ చరణ్ ఒక ఊహించని గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. సురేంద్ర రెడ్డి రామ్ చరణ్ లకు ‘ధృవ’ మూవీ నిర్మాణ సమయం నుండి మంచి స్నేహం కొనసాగుతోంది. ఆ స్నేహంతోనే సురేంద్ర రెడ్డి సమర్ధత పై చిరంజీవికి నమ్మకం లేకపోయినా చరణ్ పట్టుపట్టి ‘సైరా’ మూవీ అవకాశాన్ని సురేంద్ర రెడ్డికి ఇచ్చాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి.

చరణ్ సురేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులతో కూడ చాల సన్నిహితంగా ఉంటాడు. సురేంద్ర రెడ్డి కొడుకు చరణ్ ఫామ్ హౌస్ లోని ఒక గుర్రపు పిల్ల కావాలి అని అడిగితే చరణ్ సురేంద్ర రెడ్డి కొడుకు కోరిక తీర్చాడు. ఇప్పుడు ‘సైరా’ వల్ల ఏర్పడిన పని భారంతో గత రెండు సంవత్సరాలుగా టెన్షన్ పడుతున్న సురేంద్ర రెడ్డిని అతడి కుటుంబంతో కలిసి సుమారు నెలరోజుల పాటు యూరప్ ట్రిప్ వెళ్ళడానికి ఇప్పటికే చరణ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సురేంద్ర రెడ్డికి షాక్ ఇచ్చాడు.

సాధారణంగా ఒక సినిమా ఒక మూవీ ఘన విజయం సాధించిన తరువాత ఆ మూవీ దర్శకుడుకి భారీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇంకా ‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడ పూర్తి కాకుండానే సురేంద్ర రెడ్డి విహార యాత్రను ఇప్పటి నుంచే చరణ్ ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

దీనితో ‘సైరా’ సక్సస్ పై చరణ్ కు ఎంత నమ్మకం ఉందో అర్ధం అవుతుంది. చారిత్రక సినిమాలు తీయడంలో ఎటువంటి అనుభవం లేని సురేంద్ర రెడ్డిని నమ్మి 270 భారీ సినిమా తీయడమే కాకుండా ఆ మూవీ రిజల్ట్ తెలియకుండానే సురేంద్ర రెడ్డికి ఇలాంటి ఊహించిన గిఫ్ట్ ఇవ్వడం ద్వారా చరణ్ తన దర్శకులను ఎలా నమ్ముతాడో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: