ప్రస్తుతం చిరంజీవి నటించిన అత్యంత భారీ బడ్జెట్ సినిమా సైరా.. ఈ సినిమాలో ఎందరో ప్రముఖ నటులు నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది చిత్ర యూనిట్. ఆ రోజున బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమా ఉండటంతో పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ వినపడుతుంది. 

అంత భారీ బడ్జెట్ తో వస్తున్నా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా.. ప్రమోషన్ పనుల్లో ఎవరికీ వారే అన్నట్లుగా బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా సాటిలైట్ రైట్స్ కూడా బాగానే పలుకుతుంది. ఆ సినిమాలోని పవన్ బ్యాగ్ గ్రౌండ్ వాయిస్ కూడా ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. అన్న, తమ్ముడు ఒకే స్క్రీన్ పంచుకోవడం పై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

విషయానికొస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారో అనే ఆలోచన అందరిలో మొదలైంది. మొదట ముంబైలో ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు.. కానీ, రిస్క్ అని వద్దనుకున్నారు. మళ్ళీ కర్నూల్ ఈ ఈవెంట్ చేయాలనుకున్నారు. అది కూడా బెడిసికొట్టింది. ఇకపోతే ఈ ఈవెంట్ ను హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో చేయాలనీ అనుకున్నారు. దానికోసం ముహూర్థం కూడా ఫిక్స్ చేసుకున్నారు ఆ చిత్ర యూనిట్. 

ఈ నెల 18న ప్రి-రిలీజ్, ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చరిత్ర కారుడు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో అందుకు తగ్గట్లే ఎల్‌బీ స్టేడియంలో భారీ సెట్‌ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి ఎవరు ముఖ్య అతిధులుగా వస్తారో అని అందరు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ పెద్ద ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు కానీ, మంత్రి కొన్ని కారణాల వల్ల రావడం లేదని అర్థమవుతుంది. దీనితో సైరా టీమ్ మరో మంత్రిని వెతికే పనిలో పడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: