సైరా మూవీ మెగా క్యాంప్ కి చాలా ప్రెస్టేజియస్ మూవీ అనడంలో సందేహం లేదు. ఇప్పటివరకూ ఏ రికార్డ్ అయినా మెగా క్యాంప్ దాటి పోలేదు. అయితే రాజమౌళి బాహుబలి సీరీస్ తరువాత సీన్ మొత్తం మారిపోయింది. నాన్ బాహుబలి రికార్డులే ఇప్పటివరకూ  బద్దలవుతున్నాయి తప్ప బాహుబలి రికార్డులు మాత్రం అలాగే ఉన్నాయి. దాంతో మెగా క్యాంప్ చాలా పంతం మీద ఉంది.


ఇండస్ట్రీలో రికార్డులు ఏవైనా సరే తమ పేరు మీదనే ఉండాలని గట్టిగా భావిస్తోంది. ఆ పట్టుదల నుంచి పుట్టిందే  సైరా నరసింహారెడ్డి. ఈ మూవీని మెగాస్టార్ ప్రాణం పెట్టి చేశాడు. బాహుబలికి, ఈ మూవీకి కధ విషయంలో పోలిక ఎక్కడా లేదు. బాహుబలి జానపదం జోనర్, పైగా కధ కల్పన. సైరా అలా కాదు, ఓ చరిత్రపురుషుడి కధ. జరిగిన కధ. పైగా స్వాతంత్ర సమరయోడిగా తొలిసారిగా తెల్లవారి మీద దండెత్తిన వీరుడి కధ. అయితే సైరాలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి.




గ్రాఫిక్స్ ని పూర్తిగా ఉపయోగించుకునేందుకు వీలు ఉంది. టెక్నాలజీ బాగా డెవలప్ అయిన సందర్భంలో బాహుబలితో సమానంగా వండర్స్ ఇందులో క్రియేట్ చేయవచ్చు. అయితే పాటలు మూడే ఉంటాయని టాక్ వినిపిస్తోంది. పైగా ఇందులో కొన్ని ఎమోషన్లనే కారీ చేయడానికి స్కోప్ ఉంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కోరుకునే డ్యాన్సులు, రొమాన్స్ వంటివి ఉండవు. మూవీ సబ్జెక్ట్ అలాంటిది. అయితే పూర్తి ఇన్వాల్వ్ మెంట్ పెట్టి తీసిన మూవీ కావడం వల్ల సైరాకి  హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ బాగుందని టాక్ రావాలే కానీ బంపర్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.


మరి డ్రై  సబ్జెక్ట్ అయిన సైరా ప్రమోషన్ మాత్రం నెమ్మదిగా సాగుతోంది. దాన్ని అధిగమించిన పక్షంలో సైరా దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉండగా సీరా ప్రీ  రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 18న హైదరాబాద్ లో  నిర్వహిస్తారని తెలుస్తోంది. దానికి చిరంజీవి, అమితాబ్ బచ్చన్, పవన్, నయనతార, రాం చరణ్ హాజరవుతారని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: