వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ టైటిల్ పై వివాదం రోజురోజుకు ముదురుతోంది. బోయ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు ఈ మూవీ టైటిల్ ను మార్చమని ఇప్పటికే హరీష్ శంకర్ పై ఒత్తిడి చేసినా అతడు పట్టించుకోవకపోవడంతో ఈ విషయమై తమకు న్యాయం చేయమని బోయ సామాజిక వర్గ నాయకులు అడగడంతో కొందరు ప్రముఖ రాజకీయ వేత్తలు ఈ వివాదంలోకి తల దూర్చినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు అనంతపురం పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య ఈ మూవీ టైటిల్ విషయంలో తల దూర్చినట్లుగా వార్తలు రావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలిసి ‘వాల్మీకి’ టైటిల్ విషయంలో బోయసామాజిక వర్గం వారు చేస్తున్న ఉద్యమాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చి ఈమూవీ టైటిల్ మార్పు విషయంలో మంత్రి సహాయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. 

దీనితో ఈ మూవీ టైటిల్ కు సెన్సార్ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయా అన్న సందేహాలు పెరిగి పోతున్నాయి. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘డిజే’ మూవీ విషయంలో కూడ బ్రాహ్మణ సామాజిక వర్గంతో తీవ్ర వివాదాలు వచ్చాయి. 

ఇప్పడు అదే సీన్ రిపీట్ కాబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవానికి ఒక సినిమా విడుదలకు ముందు వివాదాలు ఏర్పడితే ఆ వివాదాలు ఫ్రీ పబ్లిసిటీగా మారి ఆ మూవీకి భారీ ఓపెనింగ్స్ రావడానికి సహకరిస్తాయి. ఇప్పుడు అదే పరిస్థితి ‘వాల్మీకి’ కి  ఏర్పడితే వరుణ్ తేజ్ కి ఊహించని అదృష్టం అనుకోవాలి. ఈ రోజు విడుదలైన నాని సినిమా ‘గ్యాంగ్ లీడర్’ కు పాజిటివ్ టాక్ రాని నేపధ్యంలో ‘వాల్మీకి’ ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: