నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటి లక్ష్మి, శరణ్యలు కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే విలన్ గా ఆరెక్స్ 100 హీరో కార్తికేయ నటించడమే.


నాని లాంటి హీరోకి విలన్ గా చేసే ఛాన్స్ రావడం లక్ అని చెప్పొచ్చు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వారికి నాని ఒక బ్యాక్ గ్రౌండ్ అయ్యేలా ఉన్నాడని కార్తికేయ చెప్పాడు. ఈ సినిమాలో నానికి ఈక్వల్ గా కార్తికేయ పర్ఫార్మెన్స్ ఉందని అంటున్నారు. ఇక సినిమాలో మరో సర్ ప్రైజ్ కూడా ఉందట.


అదే దర్శకుడు సుకుమార్ కెమియో. ఓ చిన్న సీన్ లో సుక్కు కనబడతాడట. ఆ టైంలో సినిమా మరో లెవల్ కు వెళ్తుందని తెలుస్తుంది. మొత్తానికి పెన్సిల్ పార్ధసారధి అదే మన హీరో నాని గ్యాంగ్ లీడర్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. అయితే సినిమా కథ, కథనాలు బాగున్నా సినిమాకు మిక్సెడ్ టాక్ వస్తుంది.


ఈ ఇయర్ ఆల్రెడీ నాని జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అవడం కన్నా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే నాని గ్యాంగ్ లీడర్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. నాని కెరియర్ లో ఈ సినిమాకు జరిగినంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ సినిమాకు జరుగలేదు. మరి నాని గ్యాంగ్ లీడర్ అసలు రిజల్ట్ ఏంటన్నది ఈవెనింగ్ కల్లా తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: