మంత టాప్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ సామాజిక కార్యక్రమాల పై కూడ చాల దృష్టి పెడుతోంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఆమె చిన్నారుల గుండె ఆపరేషన్ కోసం నిధులు సేకరించడమే కాకుండా తన సంపాదనలో కొంత శాతం విరాళులుగా ఇస్తోంది. 

ఇలాంటి పరిస్థితులలో సమంత మంచితనం పై సద్గురు జగ్గీ వాసుదేన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సద్గురు వాసుదేవ్ కావేరీ కాలింగ్ పేరిట దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటే ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో ఇప్పటికే అనేకమంది టాలీవుడ్ బాలీవుడ్ సెలెబ్రెటీలు తమ సంఘీభావం తెలియచేసారు. లేటెస్ట్ గా సమంత కూడ ఈ ఉద్యమంలో భాగస్వామి అయ్యి లక్షమొక్కలు నాటేందుకు సిద్ధమైంది.

తాను పిలుపునిచ్చిన ఉద్యమంలో భాగస్వామి అయిన సమంత పై వాసుదేవ్ తన ట్విటర్ లో ఆసక్తికర కామెంట్స్ చేసారు. ‘‘ప్రియమైన సమంత నువ్విచ్చిన పిలుపుతో ఎంతోమంది యువత ముందుకు వస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయం’’ అని సమంత పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు సమంత తన జీవితంలో ఎంచుకున్న లక్ష్యాలు అన్నీ చేరుకోవాలని తన అభినందనలు కూడ వాసుదేవ్ తెలియచేసారు. 

ఇప్పుడు ఈ కామెంట్స్ సమంత దృష్టి వరకు రావడంతో ఆమె మంచి జోష్ లో ఉన్నట్లు సమాచారం. భారత దేశంలోని నదులు అన్నింటిని అనుసంధానం చేస్తే భారతదేశంలో ఏ ప్రాంతంలోను దారిద్రం అన్నది కనిపించదు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయనాయకులు అంతా వచ్చే ఎన్నికల గురించి ఆలోచించే పరిస్థితులలో లక్షల కోట్లు ఖర్చు పెట్టవలసిన నదుల అనుసంధానం కార్యక్రమం అంతసులువుగా జరిగే విషయం కాదు. అయితే జగ్గీ వాసుదేవ్ లాంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో ఈ కార్యక్రమం కనీసం జనంలోకైన వెళుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: