బుల్లితెరపై నట ప్రస్థానం మొదలు పెట్టి వెండి తెరపై చిన్న చిన్న క్యారెక్టర్ పాత్రల్లో నటించిన బండ్ల గణేష్ తర్వాత మంచి కమెడియన్ గా ఎదిగాడు.  ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి చేరుకున్నాడు బండ్లగణేష్.  అయితే ఆయన కొంత మందికి బినామీ అంటూ ఆ మద్య తెగ పుకార్లు వచ్చినా వాటన్నింటిని కొట్టిపడేశారు బండ్ల గణేష్.  ఇక సినీ పరిశ్రమంలో తనకు ఇష్టమైన నటుడు ఎవరంటే వెంటనే పవన్ నా దేవుడు అంటాడు.  హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో టాప్ డైరెక్టర్ లీస్ట్ లో చేరిపోయాడు బండ్ల గణేష్. అప్పటి నుంచి పవన్ కళ్యాన్ పై వల్లమాలిన అభిమానం పెంచుకున్నాడు. 

ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా ఖచ్చింతంగా పవన్ నామస్మరణ ఖచ్చితంగా చేస్తుంటాడు బండ్ల గణేష్.  గత కొంత కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు బండ్ల గణేష్. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు బండ్ల గణేష్. ఆ సమయంలో టీఆర్ఎస్ పై ప్రతిరోజూ ఏదో ఒక కౌంటర్ ఇస్తూ నానా హంగామా చేశారు.  మహాకూటమి ఖచ్చితంగా గెలుస్తుందని..లేదంటే తన మెడ కోసుకుంటానని శపథం కూడా చేశారు.  మొత్తానికి ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి దారుణంగా ఓటమి పాలైంది..దాంతో కొన్ని రోజులు బండ్ల గణేష్ అజ్ఞాతంలోకి వెళ్లాడు.

ఒకరోజు తిరుపతిలో కనిపించి..ఎమోషనల్ గా ఎన్నో మాట్లాడుతాం అవన్నీ పాటిస్తారా అని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు.  ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు.  తాజాగా  బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్ అంటే తనకు ఎప్పుడూ ప్రాణమేనని ట్వీట్ చేశారు. తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్ విషయంలో తాను ప్రతి రోజు శీల పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ముగ్గురి విషయంలో వాదనలు అనవసరమని నో మోర్ డిస్కషన్స్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.   మొత్తానికి స్వామి భక్తి భలే ప్రదర్శించావయ్య బండ్ల గణేషా అంటూ నెటిజన్లు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: