కొత్త సినిమాల రిలీజ్ కు పండుగలు, సెలవులు ముఖ్యం. ఈ సీజన్లు చూసుకునే కొన్ని సినిమాలు షూటింగ్ లు జరుపుకుంటాయి. ఎందుకంటే కలెక్షన్లు రాబట్టేది ఈ సీజన్లలోనే ఎక్కువ. అలాంటి సీజన్లలో పెద్ద హీరోల సినిమాలు పోటీపడడం సహజం. ఈ జనరేషన్ లో అలా పోటీ పడింది రామ్ చరణ్ - మహేశ్ సినిమాలే ఎక్కువ. ఈపోటీలో ఇప్పటివరకూ మెగా హీరోదే పైచేయి అయింది. 

 

 

 

వచ్చే సంక్రాంతికి మెగా హీరోగా అల్లు అర్జున్ వస్తూండగా మళ్లీ మహేశ్ పోటీగా నిలువనున్నాడు. 2013లో నాయక్ - సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు పోటీ పడగా రెండూ హిట్ అయ్యాయి. కానీ కలెక్షన్లలో రామ్ చరణ్ దే పైచేయి అయింది. 2014లో మళ్లీ ఎవడు - వన్ నేనొక్కడినే అని మళ్ళీ పోటీ పడ్డారు. ఎవడు హిట్ కాగా, వన్ తో మహేశ్ డిజాస్టర్ అందుకున్నాడు. అదే ఏడాది దసరాకి మళ్లీ చరణ్ - మహేశ్ పోటీ పడ్డారు. గోవిందుడు అందరివాడేలే - దూకుడు రెండూ పండుగకు విడుదలయ్యాయి.  గోవిందుడు అందరివాడేలే.. తో ఎబౌవ్ యావరేజ్ అందుకుని 40 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాడు చరణ్. దూకుడు డిజాస్టర్ అయింది. ఇప్పుడు మళ్లీ 2020 సంక్రాంతికి మెగా - ఘట్టమనేని హీరోలు పోటీ పడబోతున్నారు. కాకపోతే మహేశ్ ఈసారి అల్లు అర్జున్ తో సై అంటున్నాడు. అల్లు అర్జున్.. అల వైకుంఠపురం, మహేశ్.. సరిలేరు నీకెవ్వరుతో వీరిద్దరూ సంక్రాంతికి పోటీ పడుతున్నారు.

 

 

 

ఇటువంటి సందర్భాల్లో పండుగ కలెక్షన్లు ఓపెనింగ్స్ వరకూ పనికొస్తాయి. రిపీట్ ఆడియన్స్ పడాలంటే మాత్రం టాక్ కంపల్సరీ. లాంగ్ రన్ కరువైపోయిన ఈరోజుల్లో కలక్షన్లే కదా హిట్, ఫ్లాప్ లను నిర్ణయించేది. మరి ఈ పోటీలో విజయం దక్కించుకునేది ఎవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: