తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తుల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి.  చిరంజీవి సొంతంగా కష్టపడి పైకి వచ్చాడు.  తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేస్తున్నారు. మెగాస్టార్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాక ఆ కుటుంబం నుంచి వరసగా హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో పవన్ కళ్యాణ్.  పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఓ అంచలనం.  అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.  


చదువు పరంగా చాలా తక్కువే చదివారు. కానీ, తనలో జాతీయతా భావం ఎక్కువ.  భగత్ సింగ్, చేగువేరా జీవితాలే ప్రేరణ అని ఇప్పటికే పవన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  సినిమా రంగంలో కోట్లాది మంది సొంతంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.  ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ ను సెట్ చేస్తా అని చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేశారు.  సినిమా రంగంలోనే కాదు.. అటు పొలిటికల్ రంగంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు.  


చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వామపక్ష భావజాలాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి.  సమాజంలో జరిగే విషయాలకు ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు.  ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  నూనూగు మీసాల వయసులో ఉన్నప్పటి ఫోటో అది.  చిన్నపిల్లవాడిగా కనిపించిన పవన్.. కళ్ళలో స్పార్క్ కనిపించింది.  చిరునవ్వుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  


ఈ ఫోటోపై అనేకమంది కామెంట్స్ చేస్తున్నారు.  కొణిదెల కొదమసింహం అని.. ట్రెండ్ సెట్ చేసిన కొణిదెల యువ సింహంఅని కొందరు కామెంట్స్ చేశారు.  ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు.  సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ తిరిగి సినిమాల్లో నటించాలని చాలామంది కోరుకుంటున్నారు. కానీ, పవన్ మాత్రం సినిమాల్లో నటించేందుకు ససేమిరా అంటున్నారు. ఈనెల 14 వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ తిరిగి ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: