టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు ఎందరో ఉన్నారు.  టాప్ హీరోయిన్లుగా ఎదగడానికి చాలా కష్టపడి ఉంటారు.  అవకాశాలు దక్కించుకొని ఉంటారు.  అవకాశాలు వచ్చినా ఆయా సినిమాలు హిట్ అయితేనే మరో సినిమా అవకాశం వస్తుంది.  లేదంటే మాత్రం ఫెయిల్ కావాల్సి వస్తుంది.  కొంతమందికి మొదటి సినిమాతో మంచి అవకాశం వస్తుంది. ఆ అవకాశంతో సెకండ్ సినిమా వస్తాయా అంటే ఏమో చెప్పలేం అని చెప్పాలి.  టాలీవుడ్ లో ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.  


మొదటి సినిమాలో నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో నటిస్తూనే బోల్డ్ లుక్ లో మెప్పించింది.  లక్షలాది మందిని తనవైపుకు తిప్పుకుంది. బోల్డ్ బోల్డ్ అందాలతో మెప్పించింది పాయల్.  వెంటనే రెండో సినిమా వస్తుందని అనుకున్నది.  కానీ, రెండో సినిమా రావడానికి చాలా సమయం తీసుకుంది.  ఈ మధ్యకాలంలో పాయాలు సోషల్ మీడియాలో రెచ్చిపోయి పోస్ట్ లు పోస్ట్ చేయడం మొదలుపెట్టింది.  వరుసగా గ్లామర్ గా ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ.. యువతకు దగ్గరైంది. 


యువతతో పాటు అటు దర్శక నిర్మాతలను కూడా ఆకట్టుకుంది.  దీంతో ఈ అమ్మడికి వెంకిమామ సినిమాలో అఫర్ వచ్చింది.  అటు రవితేజతో డిస్కో రాజా చేస్తున్నది.  ఈ రెండింటితో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఆర్డిఎక్స్ లవ్ చేస్తున్నది. ఇందులో బోల్డ్ లుక్ తో అదరగొట్టిన పాయల్, పెరఫార్మెన్స్ పరంగా కూడా వావ్ అనిపించే విధంగా నటించింది.  మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సినిమా  ఉంటుంది.  సినిమాలో పోరాట సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయట.  


ఇదిలా ఉంటె, ఈ అమ్మడికి చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని వైట్ కలర్ టీ షర్ట్ వేసుకున్న పాయల్.. ఆ షర్ట్ ను పైకి లేపుతున్నట్టుగా ఉన్న ఫోటో ను పోస్ట్ చేసింది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఈ ఫొటోకు కామెంట్స్ సైతం అదే రేంజ్ లో ఉన్నాయి.  ఆర్ఎక్స్ తో 100 మార్కులు కొట్టేసిన పాయల్, ఆర్డిఎక్స్ తో యూత్  హృదయాలను దోచేస్తుందని అంటూ మెసేజ్ చేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: