నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ను  అమెజాన్ ప్రైమ్ ద్వారా  త్వరలోనే వీక్షించేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు మేకర్స్ .  ఈ సినిమా థియేటర్లలో  విడుదలైన 50 రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్  చేసే విధంగా చిత్ర నిర్మాతలైన  మైత్రి మూవీ మేకర్స్, అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.  డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు ఇటీవల బాగానే వర్కౌట్ అవుతున్నప్పటికీ,  డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం సినిమా నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో చిత్రాన్ని  రిలీజ్ చేయడం ఎంతో కొంత నష్టం తెచ్చిపెడుతోంది.


  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న మైత్రి మూవీ మేకర్స్ నాని గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని  50 రోజుల తర్వాతే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  డిజిటల్ రైట్స్ రూపంలో అమెజాన్ ప్రైమ్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు  మంచి మొత్తాన్ని ముట్ట చెప్పినట్లు సమాచారం .  నాని గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని థియేటర్లలో చూడలేని ప్రేక్షకులు యాభై రోజుల తర్వాత ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా అమెజాన్ ప్రైమ్ లో ఎంజాయ్ చేయవచ్చు . విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ రివెంజ్ డ్రామా చిత్రం లో ఆర్ ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ విలన్ గా నటించడం తో సినిమా పై అంచనాలు పెరిగాయి .


 నేచురల్ స్టార్ నాని ఇటీవల కమర్షియల్ హిట్లు అందుకోవడం లో తడబడుతున్న నేపధ్యం లో , గ్యాంగ్ లీడర్ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్ పేరును వాడుకోవడం పట్ల మెగా అభిమానులు సోషల్ మీడియా లో తీవ్రంగా వ్యతిరేకించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: