న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా ఈరోజు థియేటర్లో సందడి చేసింది.  గతనెల 30 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా ఆరోజున ప్రభాస్ సాహో సినిమా ఉండటంతో.. నాని గ్యాంగ్ లీడర్ వాయిదా పడింది.  అక్టోబర్ 13 వ తేదీన సినిమాను రిలీజ్ చేశారు.  ఈరోజు రిలీజైన ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి.  కథ చాలా సింపుల్ గా ఉన్నా, విక్రమ్ కుమార్ కథను నడిపించిన విధానం సినిమాకు హైలైట్ గా నిలిచింది.  


చాలా కాలం తరువాత దర్శకుడు విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లేతో మాయచేశారు.  మనం తరువాత విక్రమ్ కుమార్ కు దక్కిన పెద్ద విజయంగా గ్యాంగ్ లీడర్ ను చెప్పుకోవచ్చు.  నాని నటన చాలా న్యాచురల్ గా ఉన్నది. కథ ప్రకారం హీరో ఎవరూ అంటే చెప్పడం కష్టమే.  ఎందుకంటే ఇందులో కథే హీరో.  కథనాలే హీరోను నడిపించాయి.  కథ ప్రకారం ఇది కామెడీ రివెంజ్ డ్రామా. రివెంజ్ డ్రామాలో కామెడీ మిక్స్ చేయడం అంటే చాలా కష్టం ఆ సంగతి అందరికి తెలిసిందే.  


కానీ, విక్రమ్ కథలో తనదైన శైలిలో కామెడీని మిక్స్ చేశారు.  కామెడీ సినిమాగా దీన్ని మలిచిన విధానం బాగుంది.  రివెంజ్ సినిమాకు బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.  సెంటిమెంట్, లవ్, ఎమోషన్స్ కు ఎలాంటి బీజీఎం ఇవ్వాలో అలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. రివెంజ్ డ్రామా రైటర్ పెన్సిల్ పార్ధసారధిగా నాని నటన అద్భుతం.  


పార్ధసారధి అంటే నడిపించేవాడు అని అర్ధం.  తన దగ్గరకు వచ్చిన ఐదుగురు మహిళలను ఎలా నడిపించాడు.. వాళ్ళ పగకు ఎలా సహాయ సహకారం అందించాడు అన్నది కథ.  హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ అలాగే ఓపెనింగ్ యాక్షన్ సన్నివేశం బాగా ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు.  ఇవి సినిమాకు ప్లస్ అయ్యాయి.  మొత్తంగా చూసుకుంటే ..  సాహో ఫెయిల్ తరువాత వచ్చిన ఓ మంచి సినిమాగా గ్యాంగ్ లీడర్ నిలిచింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: