బాలీవుడ్ యంగ్ హీరో  ఆయుష్మాన్ ఖురానా , నుశరత్ బరుచా జంటగా నటించిన తాజా చిత్రం డ్రీం గర్ల్.  ఈ చిత్రం ఫై  విడుదలకు ముందే  బాలీవుడ్ ప్రేక్షకుల్లో  భారీ అంచనాలను  వున్నాయి.  కాగా ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకొని  బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.  సినీ ప్రేక్షకులనుండే కాకుండా క్రిటిక్స్ నుండి కూడా యూనానిమస్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.   అందులో భాగంగా  ప్రముఖ  సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఈ చిత్రానికి ఏకంగా  4 రేటింగ్ ఇచ్చి  విన్నర్ అంటూ ట్వీట్ చేశాడు.  


రొమాంటిక్ కామెడీ  ఎంటర్ టైనర్ గా  రాజ్ శాండిల్య  తెరకెక్కించిన ఈ చిత్రంలో  ఆయుష్మాన్ ఖురానా  నటన , కామెడీ  హైలైట్ గా నిలిచాయట.  కాగా  ఆయుష్మాన్  తన కెరీర్ లో ఈ చిత్రంద్వారా  మొదటి సారి  లేడీ  గెటప్ లో  కనిపించాడు. శోభ కపూర్ , ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.   ఇక  డ్రీం గర్ల్  విజయం సాధించడం తో  ఈచిత్రాన్ని సౌత్ లోకూడా రీమేక్ చేసే అవకాశాలు వున్నాయి.  ఇదిలావుంటే  అద్భుతమైన స్టోరీలను ఎంచుకుంటూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు  ఆయుష్మాన్ ఖురానా.   గత ఏడాది అతను నటించిన బడాయి హో , అంధధూన్  సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా  ఈఏడాది  ఆర్టికల్ 15, ఇప్పుడు డ్రీం గర్ల్ తో  అదే మ్యాజిక్ ను రిపీట్ చేసి మోస్ట్ సక్సెస్ ఫుల్ యంగ్  హీరో గా హావ కొనసాగిస్తున్నాడు. 




మరింత సమాచారం తెలుసుకోండి: