నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఇటీవల జెర్సీ వంటి హృద్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, నేడు ఒక రివెంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే రివెంజ్ డ్రామానే కదా అని అనుకుంటే పొరపాటే, ఇదివరకు మనం చూసిన రివెంజ్ స్టోరీస్ మాదిరి కాకుండా, ప్రేక్షకుడికి కథ మరియు కథనాలు ఎంతో చక్కగా అర్ధం అయ్యేలా ఈ సినిమాని దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించారట. వాస్తవానికి విక్రమ్ కుమార్ సినిమాలు మంచి కథతో పాటు ఆకట్టుకునే ట్విస్టులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఈ గ్యాంగ్ లీడర్ కూడా ఆ విధంగానే ఉంటూ, 

ఎక్కడా కూడా ప్రేక్షకుడికి పెద్దగా బోర్ కొట్టించకుండా దీనిని చిత్రీకరించడం జరిగిందట. ఇక ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుళ్ మోహన్, తన పాత్ర పరిధి మేరకు బాగా నటించారట. ఏదో ఇలా వచ్చే అలా వెళ్లే హీరోయిన్ పాత్రలా కాకుండా, సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లో ఆమె నటించారు. ఇక గతంలో పలు చిత్రాల్లో తన ఆకట్టుకునే నటనతో మెప్పించిన సీనియర్ నటి లక్ష్మి గారు, ఈ సినిమాలో తన పాత్రకు జీవం పోశారని, అలానే సినిమాలో ఆవిడ పాత్రకు ప్రేక్షకులు ఎంతో కనెక్ట్ అవుతారని అంటున్నారు. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దుమ్ము రేపగా, థియేటర్ లో మరింతగా అలరించాయట. అలానే కొన్ని కీలక సీన్స్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో బాగుందని సమాచారం. 

ఇకపోతే ఎప్పటివలె హీరో నాని ఎంతో నాచురల్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారని, ముఖ్యంగా నెగటివ్ క్యారెక్టర్ లో నటించిన కార్తికేయ, ఈ సినిమా తరువాత మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం ఖాయం అంటున్నారు. ఇక దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ కథను ప్రేక్షకుడికి ఏ మాత్రం బోరింగ్ గా లేకుండా నడిపిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు ప్రేక్షకులు. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే, ఇటీవల భారీ స్థాయిలో ఖర్చులు పెట్టి, విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చతికిల బడిన సినిమాలతో పోలిస్తే, కథ మరియు కథనాలే మెయిన్ హీరో మరియు హీరోయిన్లుగా సాగిన ఈ సినిమాను కుటుంబం మొత్తం ఎంతో హాయిగా వీక్షించవచ్చని సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నాయి. ఇక దీనితో నాని ఖాతాలో మరొక హిట్ పడ్డట్లైంది.....!!    

మరింత సమాచారం తెలుసుకోండి: