నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్, నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గత రాత్రి యుఎస్ఏ, యుఎఈ వంటి దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే అక్కడినుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, అలానే నేడు మార్నింగ్ షో చూసిన వారందరూ కూడా సినిమాపై పొగడ్తలు కురిపిస్తుండడంతో గ్యాంగ్ లీడర్ టీమ్ అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక సినిమా మొత్తం ఆకట్టుకునే కథ మరియు కథనాలతో సాగిందని, ఎక్కువ మంది సినిమా చూసిన ప్రేక్షకులు చెప్తున్న మాట. మంచి ఎంటర్టైనింగ్ వేలో సాగే రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి అద్భుతమైన నటన ప్రదర్శించినట్లు సమాచారం. ఇక నెగటివ్ పాత్రలో కార్తికేయ జీవించారని, 

అలానే నాచురల్ స్టార్ గా పేరుగాంచిన నాని, మరొక్కసారిగా తన సహజ నటనను ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలు గెలుచున్నారని అంటున్నారు. కూబా అందించిన అద్భుతమైన ఫోటోగ్రఫీతో పాటు, యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సాంగ్స్ మరియు  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధానాకర్షణగా చెప్తున్నారు. ఇక సినిమా మొదలైన దగ్గరినుండి ఒక్కొక్కటిగా పాత్రల పరిచయం, ఆసక్తికరంగా కథనం ముందుకు సాగడం, కామెడీ సన్నివేశాలు, ఆకట్టుకునే ఇంటర్వెల్ సీన్, అలరించే సాంగ్స్, మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అక్కడక్కడా వచ్చే ట్విస్టులు, అలానే మనసును హత్తుకునే క్లైమాక్స్ సీన్ల తో దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రేక్షకుడి నాడిని పెట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కించారని అంటున్నారు. ఇక టాలీవుడ్ హీరోయిన్ గా తొలిసారి ఈ సినిమాలో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్, 

ఎంతో అనుభవం ఉన్న నటిలా చాలా బాగా పెర్ఫర్మ్ చేసారని అంటున్నారు. కథ, కథనాలే హీరోగా తెరకెక్కిన ఈ సినిమా, ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో తో పోలిస్తే ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుందని అంటున్నారు కొందరు ప్రేక్షకులు. ఆ సినిమాలో కేవలం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసమే భారీగా ఖర్చుపెట్టిన యూనిట్, పూర్తిగా కథ, కథనాలను నిర్లక్ష్యం చేశాయని, అయితే వాటినే తన సినిమాకు బలంగా మార్చుకున్న నాచురల్ స్టార్ నాని, ఈ గ్యాంగ్ లీడర్ హిట్ తో రెబల్ స్టార్ కి భారీ షాక్ ఇచ్చారని చెపుతున్నారు. ఇక ఈ సినిమా హిట్ తో, నేటి నుండి సాహో కలెక్షన్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి రాబోయే రోజుల్లో గ్యాంగ్ లీడర్ ఎంత మేర కలెక్షన్స్ సాధిస్తాడో తెలియాలంటే, మరికొద్దిరోజలు ఓపికపట్టాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: